ఆంధ్రప్రదేశ్‌

స్టార్టప్ పాలసీతో కోట్ల టర్నోవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 17: ‘ఉద్యోగాల కోసం ప్రయత్నించటం కాదు., అలా ప్రయత్నించేవారికి ఉద్యోగావకాశం కల్పించారు. ఇంటిపట్టున ఉంటూ నే వస్తూత్పత్తితో ఆదాయం సంపాదించే వనరును సృష్టించారు. వేలాదిమందికి ఉపాధి చూపారు. రాష్ట్రంలో అంకుర సంస్థల విధానానికి శ్రీకారం చుట్టి మీరు ఎంతో మేలు చేశారు’ అంటూ పలువురు యువకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సందర్శకుల్లా వచ్చి తనను కలిసిన యువకులను ముఖ్యమంత్రి అభినందించారు. ఒక వినూత్న ఆలోచనను ఆచరణలో పెడితే అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారని, ప్రపంచంలో మారుతున్న విధానాలకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగాలని బాబు వారికి సూచించారు. గతంలో ఐటీ విప్లవం ఉంటే, ఇప్పుడు ఐటి ప్లస్ ఐఓటీతో నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందని వివరించారు. అంకుర సంస్థలు (స్టార్టప్‌లు) ప్రారంభించేవారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రానున్నకాలంలో అంకుర కంపెనీలే యువత భవితకు మార్గం వేస్తాయన్నారు. తాము తీసుకొచ్చిన నైపుణ్య శిక్షణ విధానం వివిధ వృత్తులు చేపట్టిన యువతకు, కార్మికులకు ఉపాధిని మెరుగుపరుస్తుందన్నారు. స్టార్టప్‌ల విజయాలు వివరించేందుకు సిఎంను కలిసిన యువకులు స్పందిస్తూ ‘మీరే మా స్ఫూర్తిప్రదాత. రానున్నకాలంలో తయారుకానున్న పారిశ్రామికవేత్తల కోసం మీరు తీసుకొచ్చిన అంకుర సంస్థల విధానం (స్టార్టప్స్ పాలసీ) మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మేం బతకటమే కాదు, వేలాదిమంది జీవనోపాధికి బాటలు వేస్తున్నాం. ఇదంతా మీ వల్లనే. మీకు ఎంతో రుణపడి ఉంటాం’ అని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గెట్ మై టైలర్, ‘గెట్ మై బుక్స్’, హైర్ పప్పీ, గ్లోసీ ట్రెండ్స్.. అనే స్టార్టప్‌లను ప్రారంభించామని, వీటిద్వారా ఏడాదికి ఆరున్నర కోట్ల రూపాయల టర్నోవర్ అంచనా వేస్తున్నట్లు జీబిఐ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ స్వప్న సిద్ధార్థ్ ముఖ్యమంత్రికి వివరించారు. గెట్ మై టైలర్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా 5వేల మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. టైలరింగ్ వచ్చిన వాళ్లు ఎక్కడున్నా వారిలో నైపుణ్యాన్ని బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని, ఆర్థికంగా వారికి తోడ్పడుతున్నట్లు తెలిపారు. గెట్ మై టైలర్ స్టార్టప్‌ను రాజమండ్రికి చెందిన తాడిమళ్ల కమలాకర్ ప్రారంభించారని, 241 మీటర్ల వస్త్రంతో 47 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పున్న చొక్కాను 4రోజుల్లో తయారు చేశాడంటూ కమలాకర్‌ని ముఖ్యమంత్రికి పరిచయం చేశారు.

చిత్రం.. యువతను ప్రోత్సహించేలా స్టార్టప్ పాలసీని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్న యువకులు