ఆంధ్రప్రదేశ్‌

హైదరాబాద్‌లో అదృశ్యం..విశాఖలో ప్రత్యక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/విశాఖపట్నం, మార్చి 17: హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ విశాఖపట్నంలో లభ్యమైంది. కేసు నమోదైన కొన్ని గంటల్లోనే పోలీసులు విజయవంతంగా ఈ కేసును ఛేదించారు. ఈస్ట్‌జోన్ పరిధిలోని అంబర్‌పేటలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు అదృశ్యం కావడం ఇక్కడ కలకలం రేపింది. ఇంటిదగ్గర తెలియకుండా విశాఖ అందాలను వీక్షించాలని బయలుదేరి వచ్చిన ఐదుగురు విద్యార్థినులు క్షేమంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న శ్రీవిధి, సంగీత, ప్రీతి, నందిని, ప్రతిభ స్నేహితులు. విశాఖ బీచ్, కైలాసగిరి తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని వీరి కోరిక. తల్లిదండ్రులకు చెపితే పంపరని భావించిన వీరంతా ఎలాగైనా విశాఖ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకలకు వెళ్తున్నామని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చారు. నేరుగా రైలెక్కి విశాఖ చేరుకున్నారు. వీరిలో ఇద్దరు బాలికల వద్ద సెల్ ఫోన్లు ఉన్నాయి. తమ పిల్లలు ఇంటికి రాలేదని కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలికల వద్దనున్న సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ పోలీసులు వీరు ఎక్కడున్నదీ గుర్తించారు. బాలికల తల్లిదండ్రులతో కలిసి వాహనంలో బయలుదేరి పోలీసులు సెల్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు ప్రారంభించారు. అయితే, ఒక సెల్ స్విచాఫ్ చేయగా, రెండో సెల్ నుంచి హైదరాబాద్ పోలీసులు సిగ్నల్స్ గుర్తించారు. రైలు రాజమండ్రికి చేరుకున్నప్పటికీ రెండో సెల్ కూడా స్విచాఫ్ కావడంతో పోలీసులు ఇక వీరి ప్రయాణం విశాఖకే అని భావించి నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి బాలికలు శుక్రవారం ఉదయం ఆర్‌కె బీచ్‌కు, అనంతరం కైలాసగిరి సందర్శించారు. మధ్యాహ్నం విశాఖ జూ సందర్శిస్తుండగా స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆరిలోవ పోలీసులు బాలికలను అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలను వెల్లడించారు. దీంతో పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.అప్పటికే వీరిని వెతుకుతూ వస్తున్న పోలీసులు సమాచారం అందుకుని శుక్రవారం సాయంత్రం బాల సంరక్షణ సమితి పర్యవేక్షణలో ఉన్న బాలికలను కలుసుకున్నారు. బాలికా సంరక్షణ సమితి ప్రతినిధులతో చర్చించి బాలికలను తమతో పాటు తీసుకువెళ్లడంతో కథ సుఖాంతమైంది.