ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు/కడప/నెల్లూరు, మార్చి 17: కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వం కోసం శుక్రవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 99.35 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 1,084 మంది ఓటర్లకు గాను శుక్రవారం 1,077 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడుగురు సభ్యులు ఓటు వేయలేదు. వీరిలో ఇద్దరు సభ్యులు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, బనగానపల్లె మండలం రామతీర్థం ఎంపిటిసి సుంకమ్మ మృతి చెందడం, చాగలమర్రి మండల అధ్యక్షుడు మస్తాన్‌వలీ కడప జైలులో ఉన్నందున ఓటు వేయలేకపోయారు. నలుగురు సభ్యులు ఇతర కారణాలతో ఓటు వేయలేదు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం నుంచే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు తరలివచ్చారు. నంద్యాలలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పోలింగ్ ముగిసేంత వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సిసి కెమెరాల ద్వారా ఆన్‌లైన్‌లో పోలింగ్ ప్రక్రియను కర్నూలు కలెక్టరేట్‌లో అధికారులు పర్యవేక్షించారు. ఈనెల 20వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 99.88 శాతం ఓట్లు పోలయ్యయి. జిల్లాలో మొత్తం 841 మంది ఓటర్లు ఉండగా పెండ్లిమర్రి ఎంపిటిసి సభ్యురాలు లక్ష్మీదేవి అనారోగ్యంతో గైర్హాజరయ్యారు. అదే విధంగా ఊటుకూరు రెండవ ఎంపిటిసి సుహార్లత పార్టీ మారడంతో ఓటు హక్కు కోల్పోయారు. దీంతో శుక్రవారం 839 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కడప, జమ్మలమడుగు, రాజంపేటలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే బారులుతీరారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎంపి అవినాష్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఓటు వేశారు. క్యాంపుల నుంచి తమ మద్దతుదారులను టిడిపి, వైకాపా నాయకులు ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించారు..
స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. . మొత్తం 852 మంది ఓటర్లకుగాను 851 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు ఓటర్లు మరణించగా ఎన్నికలకు ముందే వారి పేర్లను తొలగించారు. ఒక మహిళా ఎంపిటిసి సభ్యురాలు వైకాపా శిబిరం నుంచి ఆలస్యంగా రావడంతో ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. ఆత్మకూరు, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, కావలి పట్టణాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.