ఆంధ్రప్రదేశ్‌

వామపక్షాలతో పొత్తుకు వైకాపా సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 18:రానున్న 2019 ఎన్నికలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి డూ ఆర్‌డైగా మారాయి. రానున్న ఎన్నికల్లో గెలుపుకోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమే అంటున్నాయి వైకాపా శ్రేణులు. ఈపాటికే సిపిఎం పార్టీతో పొత్తుల వ్యవహరంపై వైకాపా అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిపిఐ రాష్టన్రేతలతో సంప్రదింపులు జరిపిన తరువాత రెండు వామపక్షాలతో ఎన్నికల పొత్తుకు వైకాపా సై అననుంది. అందులో భాగంగా పట్ట్భద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల తరుపున పోటీచేసిన పిడిఎఫ్ అభ్యర్ధులు యండపల్లి శ్రీనివాసరెడ్డి, విఠపుబాలసుబ్రమణ్యంలకు వైకాపా పూర్తిస్ధాయిలో మద్దతు పలికింది. వారిగెలుపుకోసం వైకాపా సర్వశక్తులు ఒడ్డింది. గతంలో మాదిరిగా కాకుండా ఎవరికిపడితే వారికి సీట్లు ఇచ్చి నష్టపోయేకంటే గెలుపుగుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని రాష్టప్రార్టీ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. గతంలో ఇతరపార్టీలకు చెందిన ముఖ్యనాయకులు వైకాపా కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేసినా వారికి మొండి చేయి చూపారు. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా భారీమూల్యం చెల్లించుకుంది. రానున్న ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మాకం కావటంతో వైసిపి నేతలు ఇప్పటినుండే అభ్యర్ధుల వడపోత కార్యక్రమాన్ని చేపట్టినట్లు సమాచారం. రాష్ట్రం, జిల్లాలో దీన్ని బట్టిచూస్తే గెలుపుగుర్రాలకే సీట్లువచ్చే అవకాశాలుండటంతో ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులకు, ఇన్‌చార్జులకు సీట్లు వస్తాయో రావో ఆ దేవుడికే తెలియాల్సిఉంది. గతంలో తెలుగుదేశంపార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు అనుసరించిన వ్యూహాన్ని ఈసారి వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిస్ధాయిలో అనుసరించే అవకాశాలున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఏ పార్టీనుండి నాయకుడు వచ్చినా ఆ నాయకుడిని సాదరంగా ఆహ్వానించటం, అసెంబ్లీలో గెలిచే అవకాశాలు ఉంటే సీటు ఇవ్వటం, లేదంటే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పటం జరుగుతుందని వివరించనున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. గత ఎన్నికల్లో ఏకపక్షంగా వైకాపా గెలుపొందుతుందని అన్నివర్గాల భావించాయి. అయితే అనేక కారణాలవల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఈసారి బంధుప్రీతికి అవకాశం లేకుండా కేవలం గెలుపుగుర్రాలకే సీట్లు ఇవ్వనుండటంతో జగన్‌లో భారీ మార్పువచ్చినట్లైందని పార్టీశ్రేణులు భావిస్తున్నాయి. ఈపాటికే రాష్ట్రంతోపాటు, ప్రకాశం జిల్లాలోని కొంతమంది ఇన్‌చార్జులను మార్చాల్సిన అవసరం ఉందని పార్టీ గుర్తించింది. ఈనేపధ్యంలో జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోని ఇన్‌చార్జుల మార్పుచేస్తారా లేక వారికే టిక్కెట్లు ఇస్తారా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.