ఆంధ్రప్రదేశ్‌

జూన్ నెలాఖరులోగా పుష్కర పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: జూలైలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి పరిస్థితుల్లోనూ జూన్ నెలాఖరులోగా కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకోసం రెగ్యులర్ పనులను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తూనే పుష్కర పనులు గడువులోగా పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలంటూ జలవనరులు, మున్సిపల్ శాఖలకు సూచించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా కృష్ణా - గోదావరి నదుల పవిత్ర సంగమ ప్రాంతానికి యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉండనున్నందున బాగా దృష్టి పెట్టాలని, ఆప్రాంతంలో కనీసం 40 ఎకరాలను సేకరించి భక్తులకు సకల సదుపాయాలు, ప్రదర్శనశాలలు, షాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. గోదావరి పుష్కరాల తరహాలో కృష్ణా నదీమతల్లికి హారతి ఇచ్చేందుకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని సూచించారు. అయితే కృష్ణవేణి హారతి నదికి అభిముఖంగా ఉండాలో, యాత్రికుల వైపు ఉండాలో పండితులతో మాట్లాడి శాస్ర్తియంగా నిర్ణయించాలన్నారు. నదిలో ఫంటు లేదా ప్లాట్‌ఫామ్‌పై నిలబడి దుర్గగుడికి అభిముఖంగా హారతి ఇవ్వడం ద్వారా అటు దుర్గమ్మకు ఇటు నదికి హారతి ఇచ్చినట్లు అవుతుందని కొందరు సలహానివ్వగా హారతి కార్యక్రమానికి శాశ్వతంగా ఏర్పాట్లు చేసి ఆప్రాంతాన్ని పర్యాటకంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు. కలెక్టర్ బాబు.ఎ జోక్యం చేసుకుంటూ దుర్గాఘాట్‌ను 200 మీటర్ల నుంచి రెండు కిలోమీటర్ల స్థాయికి అభివృద్ధి చేస్తున్నందున అక్కడ హారతి ఇస్తే బాగుంటుందని, అలాగే ఆప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు పూలింగ్‌కు వెళ్లాలని కూడా సూచించారు. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని అన్ని దేవాలయాల జీర్ణోద్ధారణ పనులు పూర్తిచేయాలని దేవాదాయ శాఖను ఆదేశించారు. ఇప్పుడు చేసే ప్రతి పని శాశ్వత ప్రాతిపదికన ఉండాలన్నారు. గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు కర్నూలు జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పుష్కరాల సందర్భంగా వచ్చే యాత్రికుల్లో అమరావతి భవిష్యత్‌లో ఎలా ఉండాలో తెలియజేసే ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ నుంచి అమరావతి దేవాలయానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని అభివృద్ధి పరచాలన్నారు. పుష్కరాల్లోనే అమితమైన ఆదాయం వస్తున్నందున ఖర్చుపెట్టడంలో తప్పులేదని విజయవాడ, గుంటూరు స్టేషన్‌లను కూడా అభివృద్ధి చేయాలని సిఎం సూచించారు. పవిత్ర సంగమానికి అటుఇటు కలుపుతూ ఐకానిక్ బ్రిడ్జీ నిర్మాణం చేపట్టాలని కూడా సూచించారు. కూచిపూడి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కూచిపూడి వారధి నిర్మించాలన్నారు. దీనికి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ స్పందిస్తూ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, వచ్చేవారం నుంచి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.