ఆంధ్రప్రదేశ్‌

సంస్కరణ ‘పంచాయితీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 18 : రాష్ట్రంలో పరిపాలనా పరంగా మరో కొత్త సంస్కరణ తెరపైకి వస్తుందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. ఉన్నత స్థాయిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రానున్న రోజుల్లో ఈ భారీ సంస్కరణ వైపు అడుగులు పడతాయన్న పరిస్థితే కనిపిస్తోంది. ఈ సంస్కరణకు సంబంధించి ఇంతకుముందు కూడా దాదాపు రెండు మూడుసార్లు ప్రయత్నాలు జరిగినా రాజకీయ కారణాలతో అవి వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈసారి మాత్రం పాలనా వ్యవస్థలో ఈ భారీ సంస్కరణకు శ్రీకారం చుట్టేందుకే నడుం బిగించినట్లు కనిపిస్తోంది. అదే పంచాయతీ విభాగాన్ని జిల్లా పరిషత్‌లో విలీనం చేయడం. వాస్తవానికి అన్ని జిల్లాల్లోనూ గ్రామీణ పాలనా వ్యవస్థలో జిల్లా పరిషత్తులు కీలకమైన ప్రాధాన్యతతో కొనసాగడం తెలిసిందే. ఇదే సమయంలో పంచాయతీ విభాగం కూడా అంతే ప్రాధాన్యతతో కూడుకుని ఉంది. మరో వైపు జడ్పీ లక్ష్యాలు, ఉద్దేశ్యాలు, పంచాయితీ విభాగం కార్యకలాపాలు దాదాపుగా ఒకే రకంగా ఉండటంతో ఈ విభాగాన్ని జడ్పీలో విలీనం చేయాలనే అభిప్రాయం గతం నుంచి ఉన్నదే. అదే లక్ష్యంతో ఇప్పుడు ఈసారి కూడా పంచాయతీని పూర్తిగా జడ్పీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా పాలనా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే జిల్లాల్లో జడ్పీలు పూర్తి అధికారాన్ని సంతరించుకునే పరిస్థితి కనిపిస్తోంది. దీనితో జడ్పీ ఛైర్మన్లు జిల్లా పాలనలో మరింత కీలకంగా మారే పరిస్థితివుంది. జిల్లా పంచాయతీ అధికారి (డిపిఒ) నేతృత్వంలోని పంచాయితీ విభాగం జిల్లాలోని పంచాయతీల పరిపాలనను పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తుంటుంది. ఈ విభాగం ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ముందుకు సాగడం తెలిసిందే. అయితే గ్రామీణ పాలన జడ్పీ ఆధీనంలో ఉండటం, పంచాయతీలు మరొకరి ఆధ్వర్యంలో నడవడంతో పాలనా వ్యవస్థ ముందుకు వెళ్లడంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్న అభిప్రాయం ఇంతకుముందు నుంచి వున్నదే. దానికి పరిష్కారంగా మొత్తం పంచాయితీరాజ్ వ్యవస్థను జడ్పీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా పరిపాలనను సులభతరం చేయాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా రానున్న రోజుల్లో ఈ సంస్కరణ అమలైతే పంచాయితీ రాజ్ విభాగం జడ్పీ ఛైర్మన్ల పర్యవేక్షణలోకి రానుంది. ఆ తరువాత డివిజనల్ పంచాయితీ అధికారులకు సంబంధించి వర్గోన్నతి కల్పించి వారిని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులుగా మార్పు చేసి పరిపాలనను కొనసాగిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వీస్ రూల్స్ కూడా రూపొందిస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించడం చూస్తుంటే అనుకున్న దానికన్నా కొంత త్వరితగతినే ఈ సంస్కరణ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపిడివోలు తమ సర్వీసు కాలంలో మహా అయితే పరిపాలనాధికారిగా మాత్రమే పదోన్నతి పొందగలిగే అవకాశాలున్నాయి. అలా కాకుండా దీనిలోనూ మార్పులుచేసి ఎంపిడివోలకు పదోన్నతులు కల్పించడమే కాకుండా డిప్యూటీ సిఇవో స్థాయి వరకు వారికి పదోన్నతులు ద్వారా వెళ్లగలిగే మార్గాన్ని సులువు చేయనున్నారు. ఆ విధంగా మొత్తం పంచాయతీ పాలన జడ్పీ పరిధిలోకి వస్తే చోటు చేసుకునే పరిణామాలు కూడా ఆసక్తికరంగానే కనిపిస్తున్నాయి. ఇంత వరకు పంచాయతీలు కలెక్టర్ పర్యవేక్షణలో నడుస్తున్నందున ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేల మాట చాలా వరకు చెల్లుబాటయ్యే పరిస్థితే కనిపిస్తోంది. ఈ సంస్కరణ అమలైతే జడ్పీ ఛైర్మన్ జిల్లాలో అత్యంత అధికారంవున్న నేతగా మారనున్నారు. ఇది తప్పనిసరిగా నియోజకవర్గాల పరిధిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించే అవకాశం వుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ జడ్పీ ఛైర్మన్ జోక్యం చేసుకోగలిగే అవకాశం, అవసరమైన చొరవ ఈ సంస్కరణతో అందివస్తుందని, అందువల్ల తమ పరిధిలో జరిగే కార్యకలాపాల్లో తమకు పూర్తిస్థాయి నియంత్రణ ఉండకపోవచ్చునన్న అభిప్రాయం నియోజకవర్గ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల్లోనూ రెండు అధికార కేంద్రాలు వుంటాయని ఇది కొంత గందరగోళ పరిస్థితేనన్న అభిప్రాయం ఉంది.