ఆంధ్రప్రదేశ్‌

బడ్జెట్‌లో ఆరోగ్యానికీ అరకొర నిధులేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 18: రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య, వైద్యసేవలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు అంతంతమాత్రంగానే ఉన్నాయని, అరాకొర నిధులతో రాష్ట్రంలో సంపూర్ణ ఆరోగ్యం ఎలా సాధ్యమని ఎపిసిసి డాక్టర్స్ సెల్ కో-చైర్మన్ డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా బడ్జెట్ కేటాయింపులు జరపని వైనాన్ని పరిశీలిస్తే సామాన్య జనాన్ని మోసం చేసినట్టు, రోగులను కూడా చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకు ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. అన్ని ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో సీటీస్కాన్ సదుపాయాన్ని కల్పించామంటూ అసెంబ్లీలో ప్రకటించడం చంద్రబాబు అబద్ధపు పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో ఎన్‌టిఆర్ వైద్యసేవలకు వెయ్యి కోట్లను కేటాయించామని చెబుతున్న ఆయన ఆరు వందల కోట్ల రూపాయలు ఆస్పత్రుల బకాయిలకే సరిపోతుండగా మిగిలిన నిధులతో ఏవిధంగా సేవలందిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలున్నా ప్రత్యేక సదుపాయాలు లేవని, 108, 104 సిబ్బంది క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నోరు మెదపకపోవడమే కాకుండా సరైన స్పష్టత కూడా ఇవ్వలేదని తెలిపారు. మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తగిన నిధుల రాబట్టడంలో ఘోరంగా విఫలమవడం గర్హనీయమన్నారు.