ఆంధ్రప్రదేశ్‌

అపూర్వం, అద్భుతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), మార్చి 18: వేగం, రాగం, ధారణా ప్రతిభ ఒక్కచోట చేరి, సమ్మిళితమై రెండున్నర గంటలకు పైగా ఆశుకవితా వచోవిన్యాసం చేసి గుంటూరు సాహితీప్రియులపై ఓ గంగా ప్రవాహంలా కవితాధారలు వర్షించాయి. ఈ కవితా ధారల్లో సాహిత్య, సారస్వత ప్రియులైన గుంటూరు నగర భాషాభిమానులు సంపూర్ణంగా తడిసిముద్దై, అవధాన శేఖరులకు హృదయాంజలులు సమర్పించారు. అపూర్వంగా, అద్భుతంగా, శ్రవణానందంగా సాగిన ఈ ప్రత్యేక సాహిత్య గోష్ఠిని ‘కొప్పరపు కవుల అవధాన వైభవం’ పేరిట శనివారం రాత్రి నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర వేదికపై సంగీత సాహిత్య నృత్యనాటక సంస్థ సంస్కృతి సగర్వంగా సమర్పించింది. సభకు అధ్యక్షత వహించిన అజో, విభో, కందాళం ఫౌండేషన్ (యుఎస్‌ఎ) వ్యవస్థాపకుడు అప్పాజోస్యుల సత్యనారాయణ మాటల్లో చెప్పాలంటే.. గుంటూరు గడ్డపై సరిగ్గా 106 సంవత్సరాల క్రితం కొప్పరపు కవులు మధురంగా, మహావేగంతో పద్యాలను వినిపించారు. అనంతరం సంస్కృతి సంకల్పంతో ఆ మహాకవులను స్మరించుకుంటూ వారి పేరిట ఖండాంతర ఖ్యాతినార్జించిన ముగ్గురు అవధాన మేరుశిఖరాలైన డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ, డాక్టర్ మేడసాని మోహన్, డాక్టర్ గరికపాటి నరసింహారావులను ఒకే వేదికపైకి ఆహ్వానించడం అత్యంత శుభపరిణామమని ఆయనన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది చరిత్రాత్మకం కూడా అని అప్పాజోస్యుల సత్యనారాయణ అభివర్ణించారు. స్వాగతోపన్యాసం చేసిన సంస్కృతి స్థాపకులు సర్రాజు బాలచందర్ గుంటూరు సీమను తమ ఆశుకవితా జడివానలతో ముంచెత్తిన కొప్పరపు సోదర కవులు (కొప్పరపు వేంకటసుబ్బరాయ కవి, కొప్పరపు వేంకటరమణ కవులను) రానున్న హేమవళంబి నామ సంవత్సరానికి ముందుగా స్మరించుకునే అవకాశం కలగడం ఈప్రాంత వాసులకు అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పంచ సహస్రావధాని మేడసాని మోహన్ ప్రసంగిస్తూ తాను, నాగఫణిశర్మ, గరికపాటి ఎల్లప్పుడూ సోదరభావంతో మెలుగుతూ ఉంటామని అన్నారు. రసజ్ఞమైన గుణాన్ని, సౌందర్య ఆరాధనా భావాన్ని కల్గించేవాడే అవధాని అని, ఇలాంటి లక్షణాలు సంపూర్ణంగా కలగలసిన మేలుకలయికే కొప్పరపు కవులన్నారు. వారి కలాల నుంచి జాలువారిన ఆశుకవితలు ప్రతి ఇంటా అనంతంగా ప్రవహించాయని చెప్పారు. బృహత్ ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ తన స్వీయ మధుర, మంజుల గళంతో వేదికపై ఆశువుగా, స్వరరాగయుక్తంగా పద్యాలను ఆలపించి కొప్పరపు కవులకు పద్యాభిషేకం చేశారు.

చిత్రం..అపూర్వంగా సాగిన కొప్పరపు కవుల అవధాన వైభవంపై
ఆశుకవితా ధారలను వర్షింపజేస్తున్న డాక్టర్ మాడుగుల, డాక్టర్ మేడసాని, డాక్టర్ గరికపాటి