ఆంధ్రప్రదేశ్‌

సిఎం నివాసం వద్ద కొండచిలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 18: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కొండచిలువ కలకలం రేపింది. ముఖ్యమంత్రి నివాసానికి ఒకవైపు కృష్ణానదీ తీరం, మరోవైపు కొండలు దట్టంగా ఉండటంతో సాయంత్రం పూట ఆహారానికి సంచరిస్తున్న క్రమంలో ఆరడుగుల కొండచిలువ ముఖ్యమంత్రి నివాసం సమీపంలో కోడిపుంజును మింగింది. కదలలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని చెట్లపొదల్లో చేరింది. ముఖ్యమంత్రి రహదారి భద్రతా సిబ్బంది చెట్లపొదల్లో అలికిడిని గమనించి పరిశీలించారు. కొండచిలువ సాక్షాత్కరించడంతో ఆగమేఘాలపై అటవీ సిబ్బందికి సమాచారం అందించారు.
ఉండవల్లిలో పాములు పట్టే వారి సహాయంతో ఎట్టకేలకు దాన్ని బంధించి మంగళగిరి వద్ద కొండల్లో వదిలారు. ఎలాంటి అనర్థాలు జరక్కముందే పసిగట్టటంతో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి నివాస మార్గంలో కరకట్ట వెంట నిత్యం విషసర్పాలు, కొండచిలువలు సంచరిస్తూనే ఉంటాయి. అయితే కాన్వాయిల రాకపోకలతో కొంత వాటి హడావుడి తగ్గినప్పటికీ నదీతీరంతో పాటు కొండప్రాంతాల్లో పాములు, కొండచిలువలు, అడవిపందులు సంచరిస్తున్నాయి. భద్రతా సిబ్బంది మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తాజా సంఘటన రుజువు చేస్తోంది.