ఆంధ్రప్రదేశ్‌

జీవో నెం.570 ఉపసంహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 ద్వారా 982 పోస్టుల భర్తీకి గత ఫిబ్రవరి 26న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిందని, గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్‌లో రిజర్వేషన్లు అమలు కాకుండా రాష్ట్ర ప్రభత్వుం జీవో నెం.570 విడుదల చేయటం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ పేర్కొన్నారు. జివో నెం. 570 వల్ల ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలతో పాటు దివ్యాంగులకు కూడా రిజర్వేషన్లు దక్కకపోవడం వల్ల ఆయా వర్గాల యువత తీవ్రంగా నష్టపోతారని ముఖ్యమంత్రికి ఆదివారం రాసిన లేఖలో ఆయన ఆందోళన వ్యక్తపర్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం ఉత్తర్వులివ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. ఏపిపిఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో కూడా రిజర్వేషన్లు అమలుచేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. తక్షణమే జివో నెం.570 ఉపసంహరించి గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించేలా చూడాలన్నారు. డిఎస్సీ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 28వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 8వేల లెక్చరర్ల పోస్టులు భర్తీచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నిరుద్యోగ భృతి కోసం రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్ల రూపాయల నిధులు సక్రమంగా వినియోగించేందుకు, యువతకు నిరుద్యోగ భృతి నిర్ణయాన్ని సక్రమంగా అమలుపరచేందుకు అఖిలపక్షంతో సంప్రదించి విధివిధానాలు రూపొందించాల్సిందిగా లేఖలో రామకృష్ణ కోరారు.