ఆంధ్రప్రదేశ్‌

రెండు కోట్ల మందితో ప్రజాబ్యాలెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, మార్చి 20: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా లేదా అన్న అంశంపై రెండు కోట్ల మందితో ప్రజాబ్యాలెట్ నిర్వహించనున్నట్లు పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం జిల్లా మడకశిరలో ప్రత్యేక హోదా పై జరిగిన ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని రఘువీరా ప్రారంభించారు. తొలుత వాల్మీకి సర్కిల్‌లో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి రాజీవ్‌గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన జన ఆవేదన సమ్మేళనంలో వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, పరిశ్రమలు ఏర్పాటవుతాయన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కేసుల నుండి తప్పించుకోవడానికి రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తాకట్టు పెట్టి సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా రాష్ట్రాలను పట్టుకుని తిరుగుతూ దేశభక్తి గురించి కాంగ్రెస్ పార్టీకి చెప్పాలని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతపురం జిల్లాలో 5 లక్షల మంది కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ సైతం ప్రజాసమస్యల గురించి పట్టించుకోకపోవడంతో దారుణమన్నారు. దీంతో ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుందన్నారు. ప్రజాసమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయడం లేదన్నారు. ఆయా ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజల కు ఉపయోగపడే పనులను ప్రభుత్వాలు ఏమా త్రం చేపట్టడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, డిసిసి అధ్యక్షులు కోటా సత్యం, నాయకులు రమణ, నాగరాజు, చిన్న వెంకట్రాముడు, అశ్వర్థ, అమీర్‌బాషా, మంజునాథ్, నాగేం ద్ర, దొడ్డయ్య, గోపినాథ్‌తోపాటు వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మడకశిరలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరా, శైలజానాథ్ తదితరులు