ఆంధ్రప్రదేశ్‌

నాడు లక్ష ఎకరాలు లాగేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: ‘గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పేరిట రైతుల నుంచి దాదాపు లక్ష ఎకరాల వ్యవసాయ భూములను అడ్డగోలుగా దోచేశారు.. తీరా ఒక్క పరిశ్రమ రాలేదం’టూ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షింపచేసేందుకు నానా హైరానా పడుతుంటే ఓర్వలేక అడ్డుపడుతున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో వైకాపా సభ్యులు బుగ్గన రాజేంద్రప్రసాద్, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్ 2014 జూన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, తర్వాత లభించిన ఉపాధి, ఒనగూరిన ప్రయోజనాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి యనమల పైవిధంగా స్పందించారు. పెట్టుబడులు పేరిట సిఎం, మంత్రులు దావోస్, ఇతర దేశాలు పర్యటిస్తూ విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తున్నారంటూ వైకాపా సభ్యులు విమర్శించారు.
దీనిపై అధికారపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. బిజెపి పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ విందులు, వినోదాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, అన్నీ ఇక్కడ దొరుకుతాయని అన్నారు. సిఎం, మంత్రులు ఎంతో శ్రమించడం వల్ల విశాఖలో జరిగిన సమ్మిట్‌కు దేశ, విదేశీ పెట్టుబడిదారులు తరలివచ్చారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఒక్కసారైనా వచ్చి ఉంటే అర్థమయ్యేదన్నారు. దాదాపు 8మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారని, ఏదిఏమైనా పెట్టుబడుల రూపేణా పది లక్షల కోట్లు రాబోతున్నాయని, అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే వెయ్యి కోట్లు కూడా వచ్చి ఉండేవి కాదన్నారు.
తెలుగుదేశం సభ్యుడు వర్మ మాట్లాడుతూ తల్లి కాంగ్రెస్ పాలనలో ఒక్క తుని పరిసరాల్లోనే 10వేల ఎకరాల భూమిని బంధువర్గాలకు కట్టబెట్టారన్నారు. అయితే ఒక్క పరిశ్రమ, ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. తెలుగుదేశం పార్టీ ధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు దాదాపు రూ.400 కోట్లు వరకు నష్టపరిహారం చెల్లించి కొత్తగా పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తుంటే కాలుష్యం పేరిట పబ్లిక్ హియరింగ్‌ను సైతం అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. 2014 జూన్ నుంచి వివిధ శాఖల ద్వారా అమలులో ఉన్నాయని, తొలిదశలోనే 6లక్షల 20వేల 709 మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయన్నారు. బాబు కృషి వల్లనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ పరిశ్రమల కోసం రెండు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్నారు. కేవలం రూ.11కోట్లకు కక్కుర్తిపడటం వల్ల వోక్స్‌వ్యాగన్ ప్రాజెక్టు తరలిపోయిందంటూ దీనికి నాటి మంత్రి బొత్స కారకుడు కాదా అని ఆయన ప్రశ్నించగా, వైకాపా సభ్యులు అడ్డుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కమీషన్ల కోసం వేలాది ఎకరాల భూములను సేకరించారే గానీ, ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటూ అధికార పక్ష సభ్యులు పరిహసించారు.