ఆంధ్రప్రదేశ్‌

ఇదో గెలుపా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 20: ‘అధికారంలో ఉన్నామని దిగజారుడు రాజకీయాలతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు.. ఓ ఎమ్మెల్సీ సీటు గెలిచి సిగ్గులేకుండా గొప్పలు చెప్పుకుంటున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేదంతా గ్యాస్.. దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల బరిలో నిలిచి గెలవండ’ని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి టిడిపికి సవాల్ విసిరారు. సోమవారం శాసనసభ సమావేశాల అనంతరం వైఎస్సార్ సిఎల్‌పి కార్యాలయంలో ఆయన విలేఖరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రభుత్వంలో ఉండి 24 మంది ఎమ్మెల్యేలను దొడ్దిదారిన ప్రలోభపెట్టి సిఎం చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సిఎం స్థాయిలో ఇంత దిగజారిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వ అవినీతిపై శాసనసభలో ప్రస్తావించినా ఆయన తట్టుకోలేక పోతున్నారన్నారు. అసలు అవినీతిపై మాట్లాడే నైతిక అర్హత సిఎంకు లేదన్నారు. బడ్జెట్ ఖర్చులో వ్యత్యాసంపై స్పష్టత ఇవ్వకుండా మైక్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో ప్రజలను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్టీ, ఎస్టీ, బిసి సబ్‌ప్లాన్ లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. అంతకుముందు జగన్ సభలో మాట్లాడుతూ.. ఎన్‌సిఎఐఆర్ నివేదిక ప్రకారం ఏపిలో అవినీతి నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. డిస్కంలు నష్టాల్లో ఉన్నందుకు అవార్డులు ఇచ్చారా అని ప్రశ్నించారు. నివేదిక ప్రకారం ఎస్‌పిడిసిఎల్, ఈపిడిసిఎల్‌లు ప్రస్తుతం 3వేల 900 కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. బడ్జెట్‌లో కేటాయింపులు, ఖర్చు వివరాల్లో పొంతన లేదని విమర్శించారు. గత ఏడాది ఫిబ్రవరి 20న ఎస్సీ, ఎస్టీ, కాపు కార్పొరేషన్ల కేటాయింపులు ఓ రకంగా, నిధుల విడుదల మరోరకంగా ఉందని, దీనిపై ప్రభుత్వమే జారీచేసిన జీవోలను జగన్ ప్రస్తావించారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 4వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించి, 2వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని, కాపు కార్పొరేషన్‌కు వెయ్యికోట్లు చూపి 331 కోట్లు విడుదల చేశారని, నిధులను మళ్లించి తప్పుడు లెక్కలు సభలో ప్రవేశపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ ఏకపక్షంగా తమ మైక్‌లను కట్ చేస్తున్నారని కూడా జగన్ ఆరోపించారు.