ఆంధ్రప్రదేశ్‌

జగన్ కోటలో టిడిపి పాగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 20: వైకాపాకు కంచుకోటగా నిలిచిన కడప జిల్లాలో టిడిపి పాగా వేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా సత్తా చాటింది. సొంత జిల్లాలో తమ అభ్యర్థి ఓటమి వైకాపా అధినేత జగన్‌కు షాక్ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన టిడిపి అభ్యర్థి బిటెక్ రవి (మారెడ్డి రవీంద్రారెడ్డి), వైసిపి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఇరువురు పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండల వాసులు కావడం గమనార్హం. ఎన్నికలు ప్రకటించగానే టిడిపి అధిష్ఠనం బిటెక్ రవిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో వివేకానందరెడ్డి సునాయాసంగా గెలుపొందుతారని, రవి తమకు పోటీయే కాదని వైసిపి నేతలు, రాజకీయ పరిశీలకులు భావిస్తూ వచ్చారు.
వివేకాకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి లేకపోవడంతో తొలుత టిడిపి శ్రేణులు డీలా పడ్డాయి. అయితే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ జిల్లా నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అభ్యర్థి విజయం కోసం అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు. చివరకు హైకమాండ్ ఆదేశాలతో నాయకులంతా కలసికట్టుగా పనిచేసి అభ్యర్థిని గెలిపించుకోగలిగారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా కేంద్రంలో ఉండి స్థానిక ప్రతినిధులు ఎవరూ చేజారిపోకుండా చూశారు. వాస్తవానికి సంఖ్యాపరంగా జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వైసిపికి అధికంగా ఉన్నారు. టిడిపికి మెజార్టీ లేకపోయినా ఇరుపార్టీల నేతల శిబిరాలు నిర్వహించారు. వైసిపి ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకోవడంలో టిడిపి నేతలు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యారని చెప్పాలి. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతల్లో అత్యుత్సాహం, అమిత నమ్మకం, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఒంటెద్దు పోకడ వెరసి వివేకా ఓటమికి కారణమయ్యాయని పరిశీలకులు భావిస్తున్నారు. వ్యూహాత్యకంగా పావులు కదుపుతూ, ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల ఎత్తులను గమనించి ముందుకు కదిలిన టిడిపి చివరకు విజయం సొంతం చేసుకుందని చెప్పాలి. వివేకా ఓటమి జిల్లాలో వైసిపిని కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే చర్చించుకోవడం గమనార్హం.

చిత్రం..కడప ఎమ్మెల్సీగా ఎన్నికైన బిటెక్ రవి విజయోత్సవం