ఆంధ్రప్రదేశ్‌

రైతు రుణమాఫీ చారిత్రక ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: ‘రైతు రుణమాఫీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే చరిత్రాత్మక ఘట్టం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా రూ.24వేల కోట్ల మేర 35 లక్షల 65వేల మంది రైతులు లబ్ధిపొందారం’టూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. శాసనసభలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో రుణమాఫీపై సభ్యులు తరిమెల్ల రాధాకృష్ణ, డాక్టర్ నిమ్మల రామానాయుడు అడిగిన ప్రశ్నలకు పుల్లారావు పైవిధంగా స్పందించారు. అయితే వైకాపా సభ్యులు అడ్డుతగులుతూ రుణమాఫీ పేరిట రైతులను వంచించారంటూ పరిహసిస్తుండగా మంత్రి కల్పించుకున్నారు. వైకాపా సభ్యులు విశే్వశ్వరరెడ్డి, కళావతి, బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ.. ఇలా ఎందరో రూ.లక్షా 50వేలు వరకు లబ్ధిపొందారంటూ వివరించారు. ఇంకా ఏమైనా వివరాలు కావాలా? అని ఆయన అడిగినప్పుడు ఎలాంటి సమాధానం రాలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతుకు ఐదువేలు చొప్పున మాఫీ జరిగిందన్నారు. ప్రస్తుతం కోటయ్య కమిషన్ లక్ష రూపాయల వరకు సిఫార్స్ చేసినా చంద్రబాబు మాత్రం కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలన్న తపనతో రూ.లక్షా 50వేల వరకు మాఫీ చేశారన్నారు. గతంలో కేంద్రంలో దేవీలాల్ హయాంలో రూ.10వేల కోట్లు, మన్మోహన్‌సింగ్ హయాంలో రూ.15వేల కోట్లు మాత్రమే రద్దయ్యాయని ఆయన గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మొదటి నుంచి రుణమాఫీకి వ్యతిరేకి అంటూ, నాడు ఆయన చేసిన ప్రకటనల క్లిప్పింగ్‌లను సభలో ప్రదర్శించారు. నాటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వద్దకు వెళ్లి రుణమాఫీ వల్ల రైతుల్లో క్రమశిక్షణ తప్పుతుందని, బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోతుందని అన్నారన్నారు. వైకాపా సభ్యురాలు కళావతి, తదితరులు ఒకేసారి రుణాలు మాఫీ చేయొచ్చుకదా అని అడగ్గా.. టిడిపి సభ్యులు జోక్యం చేసుకుంటూ జగన్ దోచుకుని దాచుకున్న సొమ్మును వెలికితీస్తే ఒకేసారి మాఫీ చేయొచ్చంటూ చురకలంటించారు. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రుణమాఫీ కింద తొలిదశలో రూ.7వేల 565 కోట్లు విడుదల చేసి రూ.50వేలలోపు బకాయి రుణ ఖాతాలకు నేరుగా రూ.4వేల 493 కోట్లు జమ చేశామన్నారు. రెండోదశలో 28 లక్షల 27వేల మంది రైతుల రుణ ఖాతాలకు రూ.3వేల 024 కోట్లు, ఆపై ఐదో దశ నుంచి 8వ దశ వరకు 75వేల 472 సమస్యలను ప్రాసెసింగ్ చేసి అర్హులైన రైతులకు చెందిన 27వేల 879 రుణ ఖాతాలకు రూ.58 కోట్ల 86 లక్షలు విడుదల చేశామని చెప్పారు.