ఆంధ్రప్రదేశ్‌

నగరివాసులు చేసిన తప్పేంటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గ కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లోని దాదాపు లక్షా 10వేల మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.14 కోట్లతో నిర్మితమైన రక్షిత మంచినీటి పథకం మూడేళ్లు కావస్తున్నప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదంటూ వైకాపా శాసనసభ్యురాలు రోజా ఆగ్రహం వ్యక్తపర్చారు. శాసనసభలో సోమవారం జీరో అవర్‌లో ఆమె మాట్లాడుతూ ‘ఈ పథకం ప్రారంభోత్సవానికి నోచుకోకపోవటం వల్ల ఆప్రాంత ప్రజలు విషపూరిత నీటిని తాగుతూ అనారోగ్యాల పాలవుతున్నారు’ అని చెప్పారు. ఈ పథకాన్ని ప్రారంభించాలంటూ గత సమావేశాల్లో స్థానిక మున్సిపల్ కమిషనర్ స్వయంగా వచ్చి సిఎం చంద్రబాబును కోరారని, తాను అనేకసార్లు చిత్తూరు జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇన్‌చార్జి మంత్రి నారాయణలను అనేకసార్లు కోరానని చెప్పారు. ఇక కలెక్టర్‌ను లెక్కలేనన్నిసార్లు అడిగానన్నారు. అయితే తన నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పాపం ఏమిటని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. శాసనసభలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించాలని వైకాపా సభ్యులు సంజీవయ్య కోరారు. హోంగార్డులకు వేతనం పెంచాలని బిజెపి సభ్యుడు విష్ణుకుమార్‌రాజు, వైకాపా సభ్యులు వెంకటరెడ్డి కోరారు. విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వీరి వేతనాలు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గత మహానాడులోనూ తీర్మానం చేశారంటూ గుర్తుచేశారు. అసలు స్వచ్ఛాంద్ర సంస్థ అనే పదాన్ని చట్టాల్లో నుంచి తొలగిస్తేకాని కొన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు. హోంగార్డులు నేడు అన్ని పనులు చేస్తున్నందున పోలీసులతో సమానంగా వేతనం పెంచాలని కోరారు.