ఆంధ్రప్రదేశ్‌

అవినీతిని ప్రక్షాళన చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని, పేదవాడికి అవినీతి రహిత సమాజం ద్వారా సేవ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర శాసనమండలిలో సోమవారం ఆయన ప్రసంగించారు. దాదాపు రెండున్నర గంటల సేపు ఆయన సభలో ప్రసంగించారు. రాష్ట్భ్రావృద్ధికి తీసుకుంటున్న చర్యలు వివరించారు. పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలన్నది తన కోరిక అని, తనకు వేరే కోరిక లేదన్నారు. పేదవాడి అభివృద్ధి, సంతోషం తన ప్రాధాన్యాలని వివరించారు. అభివృద్ధికి అడ్డుపడితే చర్యలు తీసుకుంటానని, భయపడి వెనక్కివెళ్లనని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ విజన్ అని తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతానికి వెళ్లి ఎన్టీఆర్ రాజకీయం చేశారని, ఆయన వేసిన పునాది కారణంగానే కాంగ్రెస్ ఈ స్థాయికి చేరిందన్నారు. ఎప్పుడూ తన డ్రస్ ఇదేనని, దావోస్ పోయినా ఇదే వేసుకుంటానని, సూట్ వేసుకోనని సిఎం అన్నారు. పచ్చచొక్కాను మాత్రం పార్టీ సమావేశాలకు వెళ్లినప్పుడు వేసుకుంటానని, క్రమశిక్షణ అన్నది తనను చూసి అనుకరించాలని భావించి అలా వెళ్తానన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్ధతతో చేసి ఉంటే బాగుండేదని, సోనియా జన్మదినం, ఇటలీ రిపబ్లిక్ డేలను కలిసివచ్చేలా తేదీలను నిర్ణయించారని, ఇది పుండు మీద కారం చల్లినట్లుగా ఉందన్నారు. ఇలా అంటే తెలంగాణలో విమర్శిస్తారన్నారు. ఇష్టంతో చేస్తే ఎనర్జీ పెరుగుతుంది. ఇష్టంతో చేస్తే తనకు ఎనర్జీ పెరుగుతుందని, తాను మాట్లాడుతుంటే నిరంతరం ఎనర్జీ లెవెల్ పెరుగుతుందన్నారు. తాను తినే ఆహారం తెలిసిందేనని, తాను మామ ఇచ్చిన బంగారు వాచ్, ఉంగరం పెట్టుకోనని, పెట్టుకున్న సందర్భం లేదన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమన్నారు. 30 పోలీస్ చట్టం వల్ల ఆందోళనలు చేసేందుకు లేకుండా చేశారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ వ్యాఖ్యానించగా, ‘మీకు ఊరేగింపులు కావాలి.. అభివృద్ధి కాదు’ అని వ్యాఖ్యానించారు. ఎంతమంది జీవితాల్లో వెలుగుతెచ్చారో చెప్పాలన్నారు. చంద్రశేఖర్ స్పందిస్తూ తమను ఉపయోగించుకుంటారని, మీకు వాటిని ఓట్లుగా మార్చుకునే తెలివి ఉందన్నారు. విధానాల వల్ల ప్రజలకు మేలు జరిగినప్పుడే ప్రజలు మనతో ఉంటారని తెలిపారు. వారికి లాభం కలగాలని, నమ్మకం కలిగించాలన్నారు. ఒకదశలో జరగని పనులు చెబితే ఎలా అంటూ చంద్రశేఖర్‌పై అససహనం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రక్షాళన చేస్తానని, 750 సీట్లతో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. మద్యాన్ని గరిష్ట ధర కంటే 25 రూపాయలు అధికంగా విక్రయిస్తున్నారని ఎమ్మెల్సీ వీర్రాజు చెప్పగా, దానిపై సిఎం స్పందిస్తూ, త్వరలో కొత్త మద్యం కొత్త విధానం తీసుకురానున్నామన్నారు. అధిక మొత్తం వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ పింఛను పథకాలకు పేర్లు పెట్టాలని ఎమ్లెల్సీ సుధాకర బాబు కోరగా, వారి ఆత్మగౌరవానికి తగినట్లుగా పేర్లు పెడతామన్నారు. వారసత్వంగా వచ్చిన సమస్యల్లో అగ్రిగోల్డ్ సమస్య ఒకటని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం రాష్ట్భ్రావృద్ధికి నిండుమనసులో భాగస్వాములు కావాలని సిఎం పిలుపునిచ్చారు. అనంరతరం గవర్నర్‌కు ధన్యవాదాల తీర్నానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.