ఆంధ్రప్రదేశ్‌

అధినేతలకు సొంత జిల్లాల్లో అవమానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 20: స్థానిక సంస్థలు, టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇద్దరు అధినేతలకు సొంత జిల్లాల్లో అవమానాల పాలుచేశాయి. కడపలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టారు. కొద్ది మెజారిటీతోయినా గెలుస్తారని, దేశం ఓటర్ల క్రాస్ ఓటింగ్‌తో బయటపడతామని ధీమాతో ఉన్న జగన్ అంచాలు తారుమయి, చిన్నాన్న ఘోరంగా ఓడిపోయారు. వైఎస్ కుటుంబానికి, వ్యక్తిగతంగా జగన్ ఇమేజ్‌కు ఇది నష్టమే. ఇక చిత్తూరు జిల్లాలో టీచరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి వాసుదేవనాయుడు వైసీపీ బలపరిచిన బాలసుబ్రమణ్యం చేతిలో ఘోరంగా ఓడిపోవడం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు షాక్ నిచ్చింది. మూడు స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించి, కడపలో వైఎస్ కుటుంబాన్ని ఓడించి సాయంత్రం వరకూ ఆనందంలో ఉన్న బాబుకు సొంత జిల్లా టీచరు నియోజకవర్గ అభ్యర్థి ఓటమి మింగుడుపడని విషయమే. దీనితో సాయంత్రం వరకూ విజయోత్సాహంతో ఉన్న తెదేపా, రాత్రికి వెలువడిన టీచరు, గ్రాడ్యుయేట్ ఫలితాలతో నిరాశపడింది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకున్న తెలుగుదేశం.. టీచర్లు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్ధుల విజయపరంపరను అడ్డుకోలేకపోయింది. ఫలితంగా విద్యావంతులు ప్రభుత్వానికి అనుకూలంగా లేరన్న సంకేతాలు వెళ్లేందుకు కారణమయ్యాయి.