ఆంధ్రప్రదేశ్‌

బాబు ఖుషీ.. ఖుషీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 20: రెండున్నరేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీకి కడప రూపంలో వచ్చిన భారీ విజయాన్ని తెలుగుతమ్ముళ్లు ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ఇప్పటివరకూ కడప వైపు కనే్నసేందుకే భయపడిన పార్టీ నాయకత్వం ఇప్పుడు ఏకంగా వైఎస్ కుటుంబానికి పట్టున్న కడపను కొల్లగొట్టడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సోమవారం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కడపలో తామే పాగా వేశామన్న విషయం తెలుసుకున్న చంద్రబాబునాయుడు అసెంబ్లీలో, బయట ఖుషీగా కనిపించారు. ఆయన ఆ ఉత్సాహంతోనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మాట్లాడిన సందర్భంలో జగన్‌పై నిప్పులు చెరిగారు. ఇక మీ బండారం బయటపెడతామని హెచ్చరికలు జారీ చేశారు. కడపలో అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకున్న వైనాన్ని బాబు మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. బాబుకు స్వీట్లు తినిపించగా, బాబు మంత్రి గంటాను అభినందించారు. ఈ సందర్భంగా టిడిఎల్పీ కార్యాలయంలోనూ విజయోత్సవ సందడి కనిపించింది. పార్టీ సమన్వకర్త, ఎమ్మెల్సీ టిడి జనార్దన్‌రావుతో ఎమ్మెల్యేలు తమ విజయోత్సాహం పంచుకున్నారు. కడప, కర్నూలు ఎమ్మెల్యేలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. కాగా, తాజా విజయంతో ఇక రాయలసీమ మీద కూడా పార్టీ పట్టు సాధించినట్టేనని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తే జగన్‌కు భయపడాల్సిన పని ఉండదని పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు. ఇప్పటివరకూ సీమలో పార్టీ మారిన ఎమ్మెల్యేల సహకారం తీసుకున్నామని, ఇకపై ఈ విజయంతో సొంతంగానే ఎదిగే వ్యూహాలకు పదునుపెట్టడానికి ఇదే తగిన సమయమని చెబుతున్నారు. కడపలో తమ పార్టీ గెలవడం ద్వారా వైసీపీని మానసికంగా దెబ్బతీసినట్టయిందని ఎమ్మెల్యేలు లాబీలో విశే్లషించారు. జగన్‌కు ఇది మానసికంగా దెబ్బేనని, ఇకపై ఆయన కడప జిల్లాకే పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. సొంత జిల్లాలోనే పార్టీని గెలిపించుకోలేని నేత ఇక మమ్మల్ని ఎలా గెలిపిస్తారన్న సందేహాలు ఆ పార్టీ నేతల్లో మొదలవడం ఖాయమని మరికొందరు విశే్లషించారు. ‘ఇది జగన్‌కు మానసికంగా దెబ్బనే. ఇకపై ఇతర జిల్లాల్లో తన పార్టీ నేతలను ఆదేశించే అవకాశాలు ఉండవు.
సొంత బాబాయినే గెలిపించుకోలేని నేత మమ్మల్నేం గెలిపిస్తారన్న సందేహాలు కూడా వాళ్ల పార్టీలో సహజంగానే మొదలవుతాయి. అయితే మేం కడపలో ఈ విజయంతో సంతృప్తి చెందకూడదు. ఇక జగన్ కూడా వౌనంగా ఉండరు. ఆయన జిల్లాపై మరింతపై దృష్టి సారిస్తారు. ఆ క్రమంలో రాష్ట్రంపై దృష్టి తగ్గిస్తారు. ఆ సమయాన్ని మేం సద్వినియోగం చేసుకోవాల’ని ఓ సీనియర్ ఎమ్మెల్యే విశే్లషించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడపకు నీళ్లు ఇచ్చినందుకు కృతజ్ఞతగా అక్కడి ప్రజాప్రతినిధులు కడప ఎమ్మెల్సీని బహుమానంగా ఇచ్చారని ఎమ్మెల్సీ టిడి జనార్ధన్‌రావు మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. సమర్థవంతమైన బాబు నాయకత్వం, సమర్థులైన నేతలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకం అన్నీ కలసి కడపలో పార్టీ అభ్యర్థిని గెలిపించాయని ఆయన విశే్లషించారు. సీమలో తమ పార్టీకి పట్టులేదన్న వారికి ఈ ఫలితాలు చెంపపెట్టని కూడా జనార్ధన్‌రావు స్పష్టం చేశారు.

చిత్రం..మండలి ఎన్నికల్లో, ప్రత్యేకించి కడపలో విజయంపై మంత్రి గంటాకు మిఠాయి తినిపించి ఆనందం పంచుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు