ఆంధ్రప్రదేశ్‌

సభలో బడ్జెట్ సెగలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 21: శాసనసభలో 2017-18 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై అధికార, విపక్ష సభ్యుల మధ్య సెగలు, పొగలు రగులుకున్నాయి. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వివరణకు ముందు టిడిపి, బిజెపి, వైసిపి సభ్యులు భిన్నస్వరాలు వినిపించారు. వైసిపి సభ్యుడు రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ టిడిపి అంటే టెంపరరీ డెవలప్‌మెంట్ పార్టీ అని, బడ్జెట్ కేటాయింపులు అదేమాదిరిగా ఉన్నాయని చమత్కరించారు. ఆరోగ్యశ్రీకి రూ. వెయ్యి కోట్లు కేటాయించారని, 2007లో ఉన్న ధరలకు తాము చేయలేమని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేశాయని విమర్శించారు. ఆసుపత్రులకు ప్రభుత్వం రూ. 1420కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రైతు రుణమాఫీ రూ. 87వేల కోట్లకు గాను కేవలం రూ. 3వేల కోట్లతో మమ.. అనిపించారని, డ్వాక్రా సంఘాలకు రుణ పరపతి లేకుండా పోయిందని విమర్శించారు. ఇంతలో మైక్ కట్ కావడంతో వైసిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుకు స్పీకర్ మాట్లాడే అవకాశమిచ్చారు. దీంతో వైసిపి ఎమ్మెల్యేలు నిరసన నినాదాలు చేశారు. రాజేంద్రనాథ్ ఆరోపణలపై మంత్రి మృణాళిని స్పందిస్తూ ఇప్పటికే డ్వాక్రా మహిళలకు రుణవిముక్తి సొమ్ము నేరుగా ఖాతాల్లో జమ అయిన విషయం గ్రహించాలన్నారు. కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ తమది బడుగుల బడ్జెట్ అని అభివర్ణించారు. అవిభక్త రాష్ట్రంలో రాజకీయ కారణాల వల్ల కొంతమందికే పాలనా వ్యవస్థ పరిమితమైందని, ఎన్టీఆర్ పెనుమార్పులు తీసుకొచ్చారన్నారు. రాజేంద్రనాథ్‌రెడ్డి తెలుగుదేశం పార్టీపై చేసిన విమర్శలకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. పట్టిసీమ ద్వారా నాలుగు జిల్లాలకు సాగునీరు అందించామని, వైసిపి నేతలు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీంతో వైసిపి సభ్యులు స్పందిస్తూ రౌడీయిజం చలాయిస్తే కుదరదన్నారు. శ్రీనివాసులు మాట్లాడుతూ తమది సంక్షేమ, పేదల బడ్జెట్ అని చెప్తూ ప్రగతిని బలోపేతం చేసేదిగా ఉందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక లోటులో సతమతమవుతున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాల సమతుల్యతతో అన్ని వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నారు. మరో ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ కాంగ్రెస్, వైఎస్ హయాంలో ఎస్సీలను వంచించారని ఆరోపించారు. దీనిపై కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వైసిపి ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ బడ్జెట్‌తో అరచేతిలో వైకుంఠం చూపారని విమర్శించారు. ప్రజలకు చిత్తశుద్ధితో మేలుచేసే దృష్టి ప్రభుత్వానికి లేదన్నారు. ఎస్సీల సంక్షేమానికి 2017-18లో రూ. 3283 కోట్లు కేటాయించారని, ఇప్పటివరకు 2వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. దీనిపై మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి 90నుంచి 95శాతం ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్దేశించిందని చెప్పారు. దీంతో సంతృప్తిచెందని వైసిపి ఎమ్మెల్యేలు ఈ అంశంపై చర్చించేందుకు తమకు గడువివ్వాలని పట్టుబట్టారు. స్పీకర్ వీల్లేదన్నారు. సభలో వైసిపి ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ వ్యవహార శైలిని స్పీకర్ తప్పుపట్టారు. బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ సేవా రంగం వల్లే రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుందన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి హాస్పిటాలటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.

చిత్రం..సభలో మాట్లాడుతున్న యనమల