ఆంధ్రప్రదేశ్‌

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 21: బస్సు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడతామని రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. బస్సు ప్రమాదాల నివారణపై ప్రైవేట్ బస్సు యాజమాన్యాలతో మంగళవారం ఆర్టీసీ బస్సు భవన్ సముదాయంలో సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి శిద్దా మాట్లాడుతూ బస్సు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులోభాగంగా బస్సు స్పీడ్‌ని కిలోమీటర్‌కు 80 కి.మీలకు పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. దూరప్రాంతాలకు నడిచే బస్సుల్లో ప్రస్తుతం ఇద్దరు డ్రైవర్లు ఉంటున్నారన్నారు. దీనికి అదనంగా మరో డ్రైవర్‌ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే తరహాలో ప్రైవేట్ యాజమాన్యం సైతం దూరప్రాంత బస్సులో మొత్తం ముగ్గురు డ్రైవర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల ప్రమాదాలను నివారించడానికి టోల్‌గేట్ల వద్ద ప్రభుత్వానికి చెందిన ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనిద్వారా దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అక్కడి సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేస్తారని ఆయన తెలిపారు. దూరప్రాంత బస్సుల్లో సీట్ల పరిమితితో ప్రయాణికులను ఎక్కించాలని సూచించారు. బస్సు ప్రమాదాలను నివారించడంలో ప్రైవేట్ యాజమాన్యం సహకరించాలన్నారు. బస్సు ప్రమాదంలో డ్రైవర్లతో పాటు యజమానిపై చర్యలు తీసుకుంటామని రాఘవరావు స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్టీసీ ఎండి మాలకొండయ్య, తదితరులు పాల్గొన్నారు.