ఆంధ్రప్రదేశ్‌

అధికారంలోకి రాగానే పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 23: తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న 105 కుటుంబాల వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని తాము రూ.10 లక్షలు చేస్తామని, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి వాళ్లకు ఇస్తామని వైసిపి అధినేత జగన్ భరోసా ఇచ్చారు. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్న నిరాహార దీక్షల శిబిరం వద్దకు వామపక్షాల నాయకులతో కలిసి వెళ్లి జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ మీ సమస్యలపై గళమెత్తిన తమ పార్టీని చంద్రబాబు స్థాయిగా ప్రభుత్వం అణచివేసే విధంగా వ్యవహరించిందని చెప్పారు. ‘‘మేం మీ కోసమే అగ్రిగోల్డ్ మీద చర్చకు పట్టుబట్టాం. దానిపై ముందుగా సిఎం స్టేట్‌మెంట్ చదివేశాడు, తర్వాత పది నిమిషాలు, 20 నిమిషాలు ఇవ్వడమే గొప్ప అన్నట్లు చెప్పారు. కనీసం బాధితులు పడుతున్న బాధలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలంటే వీలుపడనివ్వలేదు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇప్పటివరకు మరణించిన 105 మందికి పరిహారం ఇవ్వాలని అడిగానని, మామూలుగా చనిపోయిన వాళ్లకే రూ.5 లక్షలు ఇస్తున్నప్పుడు కనీసం ఈ బాధితులకు ఆ డబ్బు ఇవ్వాలని అడుగుదామంటే వినడానికి వాళ్లకు ఓపిక లేకుండా పోయిందన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు తనకు శతృవు కాదు, చైర్మన్ తమ్ముడు ఎవరో కూడా తెలియదన్నారు. మీరంతా నాకు సాక్ష్యాధారాలు ఇచ్చి, ఇంత అన్యాయం జరుగుతోందని వాపోవడం వల్లే వాళ్ల తప్పులను అసెంబ్లీలోప్రశ్నించగలిగానని’ అన్నారు. మంత్రిగా ఉన్న తర్వాత, ఆస్తులు అటాచ్‌మెంట్ అవుతున్న విషయం తెలిసి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన భార్యతో తక్కువ రేటుకు కొనిపించారని మీరు ఇచ్చిన డేటాను అసెంబ్లీలో చూపించానని వివరించారు. మంత్రి స్థానంలో ఉండి కొన్నారని, అటాచ్‌మెంట్ జరగబోతోందని తెలిసి కొన్నారని చెప్పానని, అమ్మిన వ్యక్తి ఛైర్మన్ బంధువేనని చెప్పానని, హాయ్‌ల్యాండ్‌లో డైరెక్టర్‌గా ఉన్న విషయం చెప్పి, దీనిపై విచారణ జరిపించాలని కోరానని బాధితులకు వివరించారు. సమస్యను పరిష్కరించడానికి ఇంతకు ముందు కూడా ప్రయత్నం చేశాను. ఇప్పుడు కూడా చేస్తానని భరోసా ఇచ్చారు.
మీ కోసం అగ్రిగోల్డ్ టాపిక్ మాట్లాడుతుంటేనే మైక్ కట్ చేశారని, వాళ్ల తిట్లను ఆశీస్సులుగా తీసుకుంటానని, కనీసం బాధితులకు న్యాయం జరిగితే చాలు అనుకున్నానన్నారు. సబ్జెక్ట్‌ను డీవియేట్ చేయడానికి అగ్రిగోల్డ్ అంశాన్ని పక్కకు పెట్టేశారన్నారు. 40 రోజుల క్రితం మహిళా పార్లమెంటు సందర్భంగా స్పీకర్ కాస్త వెటకారంగా ‘కారు షెడ్డులోనే ఉండాలి, ఆడవాళ్లు వంటింటికే పరిమితం కావాలి. అప్పుడే వాళ్ల మీద రేప్‌లు తగ్గుతాయి’’ అంటూ చెప్పారన్నారు.
ఆ మాటలను జాతీయ మీడియాలోని పెద్ద పెద్ద పేపర్లు, టీవీ ఛానళ్లు కూడా చూపించాయని, దానికి అగ్రిగోల్డ్‌కు సంబంధం ఏముందని అడిగితే పట్టించుకోలేదన్నారు. సభను వాయిదా వేసి, 10 నిమిషాలకే మళ్లీ పిలిచి టీవీలు పెట్టి, స్పీకర్ ఆ రోజు ఏమన్నారో టీవీలో చూపించారన్నారు. చివరకు అగ్రిగోల్డ్ టాపిక్ ఏమైందోనని అడగడానికి కూడా వీల్లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. కౌరవ సభను చూడడానికి మనసొప్పక బయటకు వచ్చానని, కచ్చితంగా దీనిపై పోరాటం స్తామన్నారు. మరింత గట్టిగా నిలదీస్తామని అన్ని పార్టీలకు చెందిన వాళ్లు మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘‘చంద్రబాబు చర్మం మందం కాబట్టి ఫలితం వస్తుందన్న నమ్మకం అంతగా లేదు’’ అన్నారు. చూస్తూ చూస్తూ మూడేళ్లయిపోయింది. కళ్లు మూసుకుంటే మరో రెండేళ్లు గడుస్తాయి, ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వమన్నారు. వచ్చిన పది రోజుల్లోనే 14 లక్షల మందికి 1182 కోట్లను అందేలా చూస్తామన్నారు. బాధితుల కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలు చేస్తూ, మిగిలిన 7 లక్షల మొత్తాన్ని ఆ కుటుంబాలకు పువ్వుల్లో పెట్టి ఇప్పిస్తామన్నారు. అప్పటివరకు పోరాడండి, మీ వెనుక మనసున్న, మానవత్వం ఉన్న మేమంతా ఉన్నామని జగన్, ఇతర ప్రతిపక్ష నాయకులు హామీ ఇచ్చారు.

చిత్రం..అగ్రిగోల్డ్ బాధితుల శిబిరంలో మాట్లాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి