ఆంధ్రప్రదేశ్‌

హోదాపై సభలో రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 23: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. ప్యాకేజీ ఎవరి కోసం - బాబు కోసం.. ప్రత్యేక హోదా రాష్ట్ర సంజీవనే.. ప్రత్యేక హోదా రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి.. అంటూ ఫ్లకార్డులు చేపట్టి స్పీకర్ పోడియం ఎదుటే పెద్దపెట్టున చేసిన నినాదాలతో గురువారం ప్రారంభంలోనే శాసనసభ దద్దరిల్లింది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రశ్నోత్తరాల్లో మొదటి ప్రశ్నకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అనుమతి ఇచ్చిన వెంటనే గందరగోళం మొదలైంది. ప్రశ్నోత్తరాలు మొదలు కాకుండానే వైకాపా సభ్యులు ఆందోళన ప్రారంభించారు. ముందుగా తాము అందజేసిన ప్రత్యేక హోదా వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ ఆ పార్టీ శాసనసభ్యులు పట్టుబట్టారు. దీనికి స్పీకర్ అంగీకరించకపోవటంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో సహా సభ్యులందరూ పోడియం వద్దకు దూసుకెళ్ళి నినాదాలు ప్రారంభించారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేసారు. తిరిగి సభ ప్రారంభమైనప్పుడు కూడా వైకాపా సభ్యులు మళ్లీ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు ప్రారంభించారు. రెండోసారి దాదాపు రెండు గంటల పాటు సభ వాయిదా పడింది. ఆపై ప్రశ్నోత్తరాలను పూర్తిగా వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సిఎం చంద్రబాబు అగ్రిగోల్డ్‌పై ప్రకటన చేయటం ప్రారంభించారు. తొలుత ప్రత్యేక హోదాపై చర్చకు అనుమతి రావాలంటూ ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి కోరారు. అయితే అంశం గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనకు వచ్చిందని, దీనిపై సిఎం వివరణ ఇచ్చారన్నారు. ఇలా ముగిసిన అంశంపై తిరిగి చర్చకు తావు లేదన్నారు. అయినా చర్చ జరపాల్సిందేనంటూ సభ్యులు మరోమారు పోడియం వైపుకు దూసుకెళ్లి నినాదాలు చేయడం ప్రారంభించారు. బిజెపి పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ నేడు వేరే పాయింట్ లేకనే 8రోజుల తర్వాత ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ద్వారానే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్ మాట్లాడుతూ వైకాపా సభ్యులు ప్రతిరోజూ ప్రశ్నోత్తరాలకు అవరోధం సృష్టిస్తుండడంతో విలువైన ప్రశ్నలు చర్చకు రావటం లేదన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌పై ముఖ్యమంత్రి కీలకమైన ప్రకటన చేయబోతుంటే సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. టిడిపి సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అగ్రిగోల్డ్ సంస్థలు అవినీతి అక్రమాలకు తెరతీసాయని అన్నారు. బాధితుల పట్ల మీలో ఏమైనా చిత్తశుద్ధి ఉంటే సీఎం చేయబోయే ప్రకటనకు అడ్డుతగలవద్దన్నారు. ఇక వైకాపా సభ్యుల నినాదాల హోరు మధ్యలో జీరో అవర్‌లో పలువురు సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు. బిజెపి పక్షనేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ తాజాగా తితిదేలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.. దర్శనం టిక్కెట్లు బ్లాక్‌లో విక్రయిస్తూ వందల కోట్లు ఆర్జించినట్లు వెల్లడైంది. దీనిపై మరింత లోతుగా విచారణ జరిపిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి రాగలవన్నారు. ఏది ఏమైనా ఆలయ పవిత్రతను కాపాడాలన్నారు. తెదే సభ్యురాలు గీత మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో నర్సింగ్ కళాశాలను నెలకొల్పాలని కోరారు. నరసాపురం సభ్యులు బండారు మాధవనాయుడు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో వ్యాధి నిర్దారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.