జాతీయ వార్తలు

శరవేగంగా మధురపూడి విమానాశ్రయం విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 18: తూర్పు గోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం శరవేగంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. ఇటు ఎయిర్‌పోర్టు విస్తరణతోపాటు అటు సర్వీసులు కూడా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే జెట్ ఎయిర్‌వేస్, స్పైస్ జెట్, ట్రూజెట్ సంస్థలు హైదరాబాద్, చెన్నైలకు సర్వీసులు నడుపుతున్నాయి. ఇటీవల మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాజమహేంద్రవరం నుండి మరిన్ని సర్వీసులు నడిపే విధంగా చర్యలు తీసుకున్నారు. దేశంలోని అన్ని విమానయాన సంస్థలను ఇక్కడ నుండి విమానాలు నడిపేందుకు ఆహ్వానిస్తున్నారు. కేరళకు చెందిన ఎయిర్ పెగాసన్ అనే సంస్థ బెంగళూరు కేంద్రంగా వివిధ నగరాల మధ్య తన సర్వీసులను నడుపుతోంది. రాజమహేంద్రవరం విమానాశ్రయ డైరెక్టర్ విజ్ఞప్తి మేరకు ఈ పెగాసన్ సంస్థ తన సర్వీసులను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విజయవాడ, రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులకు తన సేవలు విస్తరించేలా నిర్ణయించింది. ఇది మొదలైతే రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్‌కు మరో సర్వీసు అందుబాటులోకి రానుంది. దీంతోపాటు ఇక్కడ నుండి బెంగళూరు నగరానికి కూడా సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం జిల్లాను వివిధ ప్రాజెక్టులతో పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టులో కూడా అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఈ విమానాశ్రయంలో వౌలిక సదుపాయాలు పెంపొందిస్తున్నారు. మధురపూడి విమానాశ్రయం విస్తరణ కూడా పర్యాటక అభివృద్ధిలో భాగంగానే జరుగుతోంది. చమురు, సహజవాయువుల సంస్థ నిక్షేపాల వెలికితీతలో భాగంగా కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్న క్రమంలో ఈ విమానాశ్రయం ఆక్యుపెన్సీ రేటు పెరిగేందుకు దోహదపడుతుందంటున్నారు. వివిధ దేశాల ప్రతినిధుల రాకతో రద్దీగా మారింది. అందుకే అంతర్జాతీయ ట్రాఫిక్ దిశగా విస్తరిస్తున్నారు. ఈ విమానాశ్రయంలో నైట్ హాల్ట్ కూడా గత పుష్కరాల నుండి ప్రారంభమైంది. ఇదే సమయంలో విమానాశ్రయ రోడ్డును కూడా విస్తరించారు. కేవలం 325 ఎకరాల విస్తీర్ణంలో ఉండే విమానాశ్రయాన్ని 820 ఎకరాల విస్తీర్ణానికి అభివృద్ధి చేస్తున్నారు. రెవెన్యూ శాఖ రన్‌వేకు అవసరమైన భూసేకరణ పూర్తిచేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో మరో ఆరు నెలల్లో ఎఫ్రాన్ పనులను కూడా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి కేవలం రెండు విమానాలు మాత్రమే నిలిపేందుకు అవకాశం ఉన్న ప్రస్తుత రన్‌వేను ఒకేసారి అయిదు విమానాలు నిలిపేందుకు వీలుగా విస్తరిస్తున్నారు. టూరిజం హబ్‌గా భావిస్తున్న తూర్పుగోదావరి జిల్లాలో కడియంలో ఫ్లోరీ కల్చర్ ప్రాజెక్టును కూడా ఏర్పాటుచేస్తున్న క్రమంలో ఈ విమానాశ్రయానికి కార్గో పెరుగుతుందంటున్నారు. అంతర్జాతీయ లాజిస్టిక్ సెంటర్ కూడా ఈ విమానాశ్రయాన్ని దృష్టిలో పెట్టుకునే కోరుకొండ మండలం నిడిగట్ల వద్ద ఏర్పాటుచేస్తున్నారు. రాజమహేంద్రవరం- తిరుపతి- బెంగళూరు, రాజమహేంద్రవరం- తిరుపతి- చెన్నై విమానాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.