ఆంధ్రప్రదేశ్‌

వాకౌట్లు..వాగ్వివాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: బిసి కమిషన్ తీరు నచ్చక బిసి కులాల నేతలు సభ నుండి వాకౌట్ చేయగా, కాపు నేతల పద్ధతి నచ్చక బిసి కమీషన్ ఛైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ సమావేశాన్ని మధ్యలోనే వాయిదావేసి, నిష్క్రమించారు. కుల సంఘాల నేతల అభ్యంతరాలు, వాదోపవాదాలు, ఉద్రిక్త పరిస్థితుల నడుమ కాకినాడలో జస్టిస్ మంజునాథ కమిషన్ సమావేశం తొలి రోజైన బుధవారం అర్థాంతరంగా వాయిదాపడింది. ఉదయం ప్రశాంతంగా జరిగినప్పటికీ, మధ్యాహ్నం నుండి ప్రారంభమైన రెండో విడత సమావేశం రసాభాసగా మారింది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల సెమినార్ హాలులో బుధవారం ఉదయం 10.30 గంటల నుండి రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సమావేశం ప్రారంభమయ్యింది. తొలుత వివిధ కులాలను బిసి జాబితాలో చేర్చాలని కోరిన వారికి, తమ గ్రూపులను మార్చాలని కోరిన కులాలతో వేర్వేరుగా అభిప్రాయాలను కమిషన్ స్వీకరించింది. బిసి జాబితాలో గ్రూపుల మార్పు కోరుకుంటున్న వారికి ముందుగా విన్నవించుకునే అవకాశం కల్పించింది. ముఖ్యంగా వివిధ కేటగిరీల్లో ఉన్న బిసి కులాలు తమను ‘ఎ’గ్రూపులో చేర్చాలని విజ్ఞప్తిచేశాయి. రెండో సెషన్ ప్రారంభం కాగా ముందుగా బిసిల్లో కొన్ని కులాల నుండి కమిషన్ అభిప్రాయలు స్వీకరించింది. కాపు సామాజికవర్గం నుండి ముందుగా 10 మంది మాట్లాడాలని, తర్వాత బిసిల నుండి 10మందికి మాట్లాడే అవకాశం ఇస్తామని జస్టిస్ మంజునాథ ప్రకటించారు. దీనిపై బిసిలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. పది మంది వంతున కాకుండా అటు ఒకరు, ఇటు ఒకరు వంతున మాట్లాడేలా చూడాలని కోరారు. దీనికి మంజునాథ అంగీకరించలేదు. ముందుగా కాపు నేతలు మాట్లాడిన తరువాతే బిసిలకు అవకాశం కల్పిస్తామని చెప్పడంతో వాగ్వివాదానికి దిగారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో బిసి సంఘాల నేతలు వాకౌట్ చేసేందుకు సిద్ధంకాగా పోలీసులు వారి వద్దకు చేరుకుని నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. మంజునాథ మాట్లాడుతూ ‘మీరు ఉంటే ఇక్కడ ఉండండి... లేకుంటే వెళ్ళిపోండి’ అని అనడంతో బిసి నేతలు సభ నుండి వాకౌట్ చేశారు. అనంతరం కాపుల నుండి కమిషన్ అభిప్రాయాలను సేకరిస్తుండగా కాపు జెఎసి నేత ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కాపుల స్థితిగతులను వివరించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించిందని వివరిస్తుండగా అక్కడే ఉన్న కాపు నాయకులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.