ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలో అంతర్మథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్ట్భద్రుల శాసనమండలి స్థానాలు రెండూ చేజారి పోవడంతో టిడిపిలో అంతర్మథనం మొదలైంది. ముఖ్యంగా వర్గ రాజకీయాలు నష్టం చేకూర్చాయని పార్టీవర్గాల్లో చర్చ సాగుతోంది. పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకోవడానికి మూడు జిల్లాల్లో టిడిపి నాయకులు ఆశించిన మేరకు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రెండు స్థానాల్లోనూ యుటిఎఫ్, వామపక్షాలు బలపర్చిన కత్తి నరసింహారెడ్డి, వైకాపా అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయ బావుటా ఎగురవేయడంతో నష్ట నివారణ చర్యలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. అక్కడక్కడ పార్టీపరంగా కొందరు ఓటర్లను టిడిపి అభ్యర్థులు ప్రలోభపెట్టినా, ముఖ్యంగా తటస్థ ఓటర్లు, మేథావివర్గం ఎలాంటి తాయిలాలకు లొంగకుండా, తమకు అవసరమైన వ్యక్తులనే ఎమ్మెల్సీలుగా ఎన్నుకున్నారన్న ప్రజాభిప్రాయాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబించాయనడంలో సందేహం లేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకున్న టిడిపి, ఈ రెండు స్థానాల్లోనూ సీమలో తన ప్రాభల్యాన్ని చాటుకోవాలని తాపత్రయపడింది. అంతకుముందే కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్ని దక్కించుకున్న ధీమాలో ఉండటంతో, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీలు కూడా తమకే దక్కుతాయన్న ఆశలు గల్లంతయ్యాయి. అనంతపురంతో పాటు కడప, కర్నూలు జిల్లాల్లో టిడిపిలో వర్గరాజకీయాలు మితిమీరడంతో సొంత వ్యక్తులే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి పూర్తి స్థాయిలో ఓట్లు వేయలేదని, ప్రథమ, ద్వితీయ ప్రాధాన్యత ఓటును ఉపాధ్యాయ స్థానంలో కత్తి నరసింహారెడ్డికి, పట్ట్భద్రుల్లో వెన్నపూస గోపాల్‌రెడ్డికి వేయడంతోనే టిడిపి బలపర్చిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఈ రెండు స్థానాల్లోనూ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు విజయానికి బాటలు వేయడం విశేషం. పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని వైకాపా కైవసం చేసుకోవడంతో పార్టీలో విశ్వాసం ఇనుమడించింది. రానున్న 2019 ఎన్నికల్లో కనీసం సగం సీట్లు దక్కించుకునే దిశగా పావులు కదిపించేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కనీసం సగం సీట్లు దక్కించుకోవడానికి, అధికార పార్టీపై ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచుకునేందుకు ప్రజాసమస్యలే అజెండాగా పార్టీ ముందుకు సాగేందుకు ఊతమిచ్చినట్లుయిందని వైకాపా నాయకులు చెబుతున్నారు.