ఆంధ్రప్రదేశ్‌

అప్రైజర్ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం: శ్రీకాకుళం జిల్లా రాజాం కరూర్ వైశ్యా బ్యాంక్‌లో అప్రైజర్ కోటి 33 లక్షల 55 వేల రూపాయల కుంభకోణానికి సూత్రధారిగా నిలిచాడు. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న వారు వాయిదాలు కట్టక పోవడంతో వారు తాకట్టు పెట్టిన బంగారాన్ని బుధవారం పరిశీలించడంతో అసలు విషయం బయట పడింది. దీంతో బ్యాంక్ మేనేజర్ చంద్రవౌళి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంగారం నాణ్యతను చూసే అప్రైజర్ గేదల ఆనందరావుపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆరు నెలలుగా ఈ బ్యాంకులో ఆనందరావు తన అనుచరులు, బంధువులు, స్నేహితులు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టించి లక్షలాది రూపాయలు రుణాలుగా ఇప్పించాడు. రుణం తీసుకుని వడ్డీ కట్టకపోవడం, తాకట్టులో ఉన్న నగలు విడిపించకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీయగా అవన్నీ నకిలీ బంగారు నగలుగా తేలింది. సుమారు 44 మంది ఈ రకంగా తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి ఒక కోటి 33 లక్షల 55 వేల 110 రుణంగా పొందారు. అంతేకాకుండా వీరిలో చాలా మంది రైతుల అవతారం ఎత్తి ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ద్వారా లక్షలాది రూపాయలు లబ్ధి పొందారు. విజయవాడ నుంచి బ్యాంక్ ఉన్నతాధికారులు ఆడిట్ నిర్వహించినప్పుడు ఈ భారీ కుంభకోణం బయటపడింది. పాలకొండ డిఎస్పీ బుధవారం ఈ కేసుకు సంబంధించి కొంత మందిని విచారించారు.