ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో భక్తుడిపై భద్రతా సిబ్బంది దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చిన వేలూరుకి చెందిన పద్మనాభం (65) అనే భక్తుడిపై గత రెండు రోజుల క్రితం ఆలయ మహాద్వారం సమీపంలో ఉన్న స్కానింగ్ కేంద్రం వద్ద టిటిడి విజిలెన్స్, ఎస్పీఎఫ్ సిబ్బంది దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ భక్తుడు అక్కడికక్కడే కుప్పకూలడంతో టిటిడి విజిలెన్స్ సిబ్బంది ముందుగా అశ్వని ఆస్పత్రికి, అక్కడ నుంచి తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. దాడిలో గాయపడ్డ పద్మనాభం స్విమ్స్‌లో కోమాలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ నేపధ్యంలో టిటిడి విజిలెన్స్ విభాగం బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ పద్మనాభంపై ఎవరూ దాడి చేయలేదని, మహిళల స్కానింగ్ క్యూలో వెళ్లడాన్ని ఆక్షేపించడంతో ఆగ్రహానికి గురై బిపి పెరిగి కుప్పకూలాడని వివరణ ఇచ్చారు. తక్షణం తమ సిబ్బంది స్పందించి అశ్విని ఆస్పత్రికి, అక్కడి డాక్టర్ల సూచన మేరకు అపోలో కార్డియాలజీ విభాగానికి తరలించి చికిత్స అందించారని పేర్కొన్నారు. అక్కడ నుంచి స్విమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు. టిటిడి సిఎంఓ డాక్టర్ వికాస్, స్విమ్స్ వైద్య బృందంతో సంప్రదిస్తూ భక్తుడికి అన్ని విధాలా మంచి వైద్యం అందిస్తున్నామన్నారు. బంధువు నాగేశ్వరరావు వన్‌టౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. స్కానింగ్ సెంటర్ వద్ద విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పురుషోత్తంను, టిటిడి ప్రైవేట్ విజిలెన్స్ సిబ్బంది భూషణం, శ్యామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.