ఆంధ్రప్రదేశ్‌

ఇంట్లో తల్లి మృతదేహం పరీక్షా కేంద్రంలో కూతురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి, మార్చి 23: నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో తండ్రి మృతి చెందడంతో అన్నీ తానై పోషించిన తల్లి కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడంతో దుఃఖాన్ని దిగమింగుతూ మృతురాలి కుమార్తె పరీక్ష రాసిన విషాద సంఘటన ఇది. వరంగల్ రూరల్ జిల్లా బురహాన్‌పల్లి గ్రామంకు చెందిన తిపర్తి రాము, రాజేశ్వరి దంపతులు కుమార్తె ప్రత్యూష, కుమారుడు నిఖిల్‌తో కలిపి గ్రామంలో పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవారు. నాలుగేళ్ల క్రితం తండ్రి రాము అనారోగ్యంతో మృతి చెందడంతో, తల్లి రాజేశ్వరి (42) పిల్లలకు అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివిస్తుండేది. ఈ క్రమంలో గురువారం రాజేశ్వరికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి మృతి చెందింది. దీంతో కుటుంబంలో విషాద చాయలు నెలకోన్నాయి. కాగా రాజేశ్వరి కూతురు ప్రత్యూష 10వ తరగతి చదువుతోంది. ఒక పక్క తీరని దుఃఖం ముంచుకొచ్చినా గ్రామస్థుల సహకారంతో దుఃఖాన్ని దిగమింగుతూ ప్రత్యూష మండల కేంద్రంలోని స్థానిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షకు హాజరైంది. తర్వాత పరీక్ష రాసి వచ్చిన అనంతరం తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి మృతితో పిల్లలిద్దరూ అనాథలయ్యారు.