తెలంగాణ

హైకోర్టు ఆదేశాలు పాటించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై కోర్టు ఉల్లంఘన కేసును హైకోర్టులో దాఖలు చేయనున్నట్లు టిటిఎల్‌పి నేత ఎ.రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై 90 రోజుల్లోపుగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని శాసనసభ స్పీకర్‌పై కేసు వేస్తున్నట్లు తెలిపారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్‌రెడ్డి మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయం తెలుసుకోవడం కోసం స్పీకర్ కార్యాలయంలోకి వెళ్లాలని తాను ప్రయత్నించినప్పుడు మార్షల్స్ అడ్డుకోవడం ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. టిడిపికి చెందిన శాసనసభ్యులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై తాము ఆధారాలతో సహా పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. అయితే ఏడాదిన్నర కాలం నుంచి ఎమ్మెల్యేలపై చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా ఏకపక్షంగా టిటిఎల్పీ విలీనానికి ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదని, ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్‌లపై నిర్ణయం తీసుకోవాలని కోరిన కోర్టు ఇందుకు 90 రోజుల గడువు విధించిందని తెలిపారు. ఆ గడువు గత ఏడాది డిసెంబర్ 21తో పూర్తయ్యిందని రేవంత్ వెల్లడించారు. ఈ దశలో తాను స్పీకర్‌ను కలిసేందుకు గురువారం అసెంబ్లీ లాబీల్లోకి వెళుతుంటే మార్షల్స్ అడ్డుకున్నారని తెలిపారు. తాను సభలోకి మాత్రమే సస్పెండ్ అయ్యాను గానీ, లాబీల్లో, ప్రాంగణతలో తిరిగేందుకు కాదని చెప్పినా వినకుండా అడ్డుకున్నారని వివరించారు. దీంతో తాము హైకోర్టులో కోర్టు ఉల్లంఘన కేసు దాఖలు చేస్తున్నట్లు తెలిపారు.