ఆంధ్రప్రదేశ్‌

పాపం... శివాజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: శ్రీకాకుళం జిల్లా పలాస సీనియర్ టిడిపి ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్ శివాజీకి మరోసారి అవమానం ఎదురైంది. శుక్రవారం సమావేశాలకు హాజరవుతున్న ఆయనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా సిబ్బంది ఎమ్మెల్యే శివాజీని అసెంబ్లీ లోపలకి అనుమతించలేదు. అయితే ఐడి కార్డు చూపించి తనిఖీ చేసిన తర్వాతే ఆయనను లోనికి అనుమతించారు. కనీసం పిఏ కూడా లేని తనలాంటి వారిని సెక్యూరిటీ సిబ్బంది ఆపుతున్నారని, అదే ఓ 15 మందిని వెంట తీసుకొచ్చే బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నల లాంటివారికి మాత్రం సెల్యూట్ కొడతారని శివాజీ వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఆయన కొద్దిరోజుల క్రితం కరకట్టపై నుంచి అసెంబ్లీకి వెళ్ళేందుకు పోలీసులు అనుమతి నిరాకరించగా.. శివాజీ పోలీసుల వైఖరికి నిరసనగా కరకట్ట దగ్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నా చేసిన విషయం తెలిసిందే. మళ్లీ నాలుగు రోజుల తర్వాత అదే ఎమ్మెల్యేకు భంగపాటు ఎదురవడం గమనార్హం.