ఆంధ్రప్రదేశ్‌

నవ్యాంధ్ర ఫిలిం చాంబర్ ఫెడరేషన్‌కు రాజీనామా చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మార్చి 24: నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్‌కు తాను ఎప్పుడో రాజీనామా చేశానని, తనకు ఫెడరేషన్‌కు ఎటువంటి సంబంధం లేదని సినీనటి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యినిర్వాహక కార్యదర్శి కవిత స్పష్టంచేశారు. శుక్రవారం గుంటూరులోని గీతారీజన్సీ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కవిత మాట్లాడుతూ సినీ పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసిన ఎస్‌విఎన్ రావుతో కలిసి గతంలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి సభ్యులను సిఎం చంద్రబాబుకు పరిచయం కూడా చేశానన్నారు. అయితే వారి వైఖరి నచ్చక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కానీ వారు తన పేరును ఉపయోగించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వారిపై జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సినీనటి కవిత