ఆంధ్రప్రదేశ్‌

రెండోరోజూ అదే తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: ‘ఓటుకు నోటు వీడియోను ప్రదర్శించాలి’ సూట్‌కేసు నీదా కాదా.. బాబూ బ్రీఫ్డ్‌మీ.. నీవు నిప్పు కాదు రాజకీయాలకు పట్టిన తుప్పు, ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన బాబు రాజీనామా చేయాలి’.. అంటూ వైకాపా సభ్యులు ప్లకార్డులతో స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పెద్దపెట్టున చేసిన నినాదాలతో గురువారం శాసనసభ ప్రారంభంలోనే దద్దరిల్లింది. దీనికి ప్రతిగా అధికారపక్ష సభ్యులు లేచి ప్రతిపక్ష నేతపై ఎదురుదాడికి దిగారు. ఓ దశలో ఆవేశంతో ఒకరిపై మరొకరు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ సర్దుబాటు చేసారు. అయినా ఉభయులు సవాళ్లు విసురుకున్నారు. రా చూసుకుందాం.. బయటకు రా.. చూసుకుందాం.. దమ్ముంటే బైటకు రండి తేల్చుకుందాం అంటూ ఒకరినొకరు సవాళ్లు విసురుకున్నారు. వైకాపా సభ్యుడు శివప్రసాద్‌రెడ్డి మీసం మెలేసారు. సభ్యుల నిరసనలు, ఆందోళనల మధ్య తొలిసారి 35 నిమిషాలు, రెండోసారి మరో 35 నిమిషాలపాటు సభ వాయిదా పడింది. మొత్తంపై మూడు గంటలపాటు వరుసగా రెండో రోజు కూడా ఎలాంటి చర్చ లేకుండానే ప్రశ్నోత్తరాలు ముగిసాయి.
తెదేపా సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రంలో ఏనాడో జరిగిన సంఘటనతో విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారంటూ మండిపడ్డారు. స్పీకర్ మాటలను కూడా తమ మీడియాలో వక్రీకరిస్తున్నారని అన్నారు. మరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 11 క్రిమినల్ కేసుల్లో చిక్కొని జైలు జీవితం గడిపిన జగన్‌కు సభలో మాట్లాడే నైతికహక్కు లేదన్నారు. మరో సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు ఎంతో ఆవేశంతో జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్‌లో ఏ మాత్రం మానవత్వ విలువలు లేవన్నారు. గాలి జనార్ధన్‌రెడ్డి, జగన్ సోదరుల్లా కలిసి తిరిగారు.. పైగా వైఎస్ రాజశేఖరరెడ్డి తన తండ్రి అని గాలి ఎన్నోమార్లు చెప్పారు. అలాంటి గాలి జైలుకెళితే అతనెవరో తెలియదన్న జగన్‌ను ఎవరూ నమ్మరని అన్నారు. 16 నెలల జైలు జీవితం గడిపిన ఆర్థిక ఉగ్రవాది అగ్రిగోల్డ్ బాధితుల సభకెళ్లి అంతా తనవల్లే సిఎం ప్రకటన చేసారంటూ ఎర్రకండువా నేతలను కౌగిలించుకోటం చూస్తుంటే నవ్వు వస్తోందన్నారు. బిజెపి పక్షనేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ప్రజలు మనల్ని ఎన్నుకుంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమన్నది మరచి రాజకీయ లబ్ధికోసం సభకు అవరోధాలు సృష్టించడం తగదన్నారు. సీనియర్ సభ్యులు ధూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ నిన్న మంత్రి పుల్లారావుపై సవాళ్లు విసిరి ఆయన విసిరిన చాలెంజ్‌కు బదులివ్వకుండా సభ నుంచి పారిపోయిన జగన్ వెలుపల బాధితుల పట్ల మొసలి కన్నీరు కార్చటం శోచనీయమన్నారు. కరవుపై వైకాపా సభ్యులు ఇచ్చిన నోటీస్‌పై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ అడ్డుపడుతున్నారని అన్నారు. వైకాపా సభ్యులు జోక్యం చేసుకుంటూ పలు కేసులపై స్టేలు తెచ్చుకున్న బాబు గురించి మాట్లాడటం శోచనీయమన్నారు. మంత్రి యనమల పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ అగ్రిగోల్డ్‌పై సిఎం ప్రకటనతో ఆ అంశం సభలో క్లోజ్ అయింది. ఇక ప్రస్తావించే అవకాశం లేదన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నిన్న సభ నుంచి పారిపోయిన వ్యక్తి నేడు తిరిగి చర్చకు దిగటం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ ఛాలెంజ్‌పై మాట్లాడుతుండగానే మధ్యలో మైక్ కట్ చేసారు.. అంటే ప్రారంభంలోనే ఛాలెంజ్‌కు సమాధానం ఇవ్వాలా అంటూ మండిపడ్డారు. జగన్ మైక్ కట్ చేయడంపై ఆ పార్టీ సభ్యులు మరోసారి స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు.