ఆంధ్రప్రదేశ్‌

ఈ ఘనత రైతులదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని రైతుల త్యాగం, సహకారంతోనే నిర్మించుకోగలుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అమరావతి పరిపాలనా నగరం ప్రాథమిక స్థూల ప్రణాళికపై ప్రిన్సిపల్ సెక్రటరీ (సిఆర్‌డిఎ) అజయ్ జైన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రైతుల సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. రైతులకు భూమితో సెంటిమెంట్ ఉంటుందని, విజయవాడ అభివృద్ధి కాకపోవడానికి కారణం భూమి అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కాటన్ దొర పుణ్యమా అని భూములు మాగాణంగా మారాయన్నారు. ఇక్కడి వాళ్లు బాగా చదువుకుని, విదేశాలకు వెళ్లే స్థాయికి ఎదిగారు.. కానీ ఆ తరువాత అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్నారు. సారవంతమైన భూమి కావడంతో ఇచ్చేందుకు మనసు రాకపోవడమేనన్నారు. అందువల్ల అనుకున్నంత ప్రగతి సాధించలేకపోయామని, మేధోవలస కూడా కారణమన్నారు. సముద్ర తీరాన్ని అనుకుని ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుతం దాదాపు 33 వేల ఎకరాల సమీకరణకు రైతులు ముందుకు వచ్చారన్నారు. తమ మీద నమ్మకంతో భూములు ఇచ్చారన్నారు. తామే వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాజధాని అమరావతిలో తొమ్మిది నగరాలు నిర్మిస్తున్నామన్నారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఐకానిక్ భవనాలుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇక్కడ అనేక పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్టార్ హాటళ్లు, ఎంటర్‌టైన్‌మెంట్ సదస్సులు వస్తున్నాయన్నారు. భారీ వాణిజ్య సముదాయాలు వస్తున్నాయన్నారు. వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రసిద్ధ కన్సల్టెంట్లను పెట్టుకున్నామని తెలిపారు. రాజధాని ప్లాన్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు సలహాలు, సూచనలు అందచేస్తే, వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. రాజధాని ప్రణాళికకు మరిన్ని సవరణలు చేస్తామని, ఇది ప్రాథమికంగా తయారు చేసిందన్నారు.