జాతీయ వార్తలు

పాక్, బంగ్లా సరిహద్దులు మూసేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదం, చొరబాట్లు, శరణార్థుల వలసలను శాశ్వతంగా అరికట్టేందుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో ఉన్న మన అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటోంది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం మధ్యప్రదేశ్‌లోని తెకన్‌పూర్‌లో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అకాడమీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘అజయ్ ప్రహారీ’పై పుష్పగుచ్ఛం ఉంచి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పాసింగ్ అవుట్ పరేడ్ సభలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్ భద్రతా దళం అసిస్టెంట్ కమాండెంట్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. మన పొరుగు దేశమైన పాకిస్తాన్ నుండి ఎదురవుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అంతర్జాతీయ సరిహద్దులను ‘సీల్’ చేయనున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. బంగ్లాదేశ్‌నుండి వస్తున్న వలసలను అరికట్టేందుకు ఆ దేశంతో ఉన్న మన అంతర్జాతీయ సరిహద్దులను కూడా మూసివేస్తామని ఆయన తెలిపారు. భద్రతాదళం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల ద్వారా సీమాంతర ఉగ్రవాదం, వలసలను పూర్తిగా అరికట్టడం సాధ్యం కావటం లేదని, అందుకే ఈ రెండు దేశాలతో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు దేశాలతో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను వీలున్నంత త్వరగా మూసివేయాలనుకుంటున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్తాన్ సరిహద్దులను, శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు దేశాలతో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసే కార్యక్రమాన్ని కేంద్ర స్థాయిలో హోం శాఖ కార్యదర్శి, సరిహద్దు భద్రతా దళం సీనియర్ అధికారులు, సరిహద్దుల వెంట ఉన్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు పర్యవేక్షిస్తారని ఆయన వివరించారు. సరిహద్దులను మూసివేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
ఈ సందర్భంగా సరిహద్దు భద్రతా దళం దేశానికి చేస్తున్న సేవలను హోంమంత్రి కొనియాడారు. విధి నిర్వహణలో అసువులు బాసిన జవాన్లకు నివాళి అర్పిస్తూ, భద్రతా దళాల్లో ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాజ్‌నాథ్ చెప్పారు. భద్రతా దళాలు అలాంటి వ్యవస్థలతో ముందుకు వస్తున్నాయని కూడా ఆయన చెప్పారు. సరిహద్దు భద్రతా దళంపై ఆయన ప్రశంసల వర్షం కురిపిస్తూ సైన్యం తర్వాత నేలపైన, నీటిపైన, ఆకాశంలోను కార్యకలాపాలు నిర్వహిస్తున్న విభాగం అదొక్కటేనని అన్నారు. తెకన్‌పూర్ అకాడమీ సందర్శన సందర్భంగా హోంమంత్రి జమ్మూ, కాశ్మీర్‌లో అల్లరి మూకలను చెదరగొట్టడానికి ఉపయోగించే ‘పావా’ షెల్ ఫైరింగ్ ప్రదర్శనను తిలకించారు. పెల్లెట్ గన్స్‌కు బదులుగా వీటిని ఈ శిబిరంలోని టేర్ స్మోక్ యూనిట్ (టిఎస్‌యు)లో తయారు చేసి కాశ్మీర్‌కు పంపిస్తారు.

చిత్రం... తెకాన్‌పూర్‌లో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అకాడమీ కేంద్రంలో
ఓ ఉత్తమ క్యాడెట్‌కు ర్యాంక్ స్టార్ ప్రదానం చేస్తున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్