ఆంధ్రప్రదేశ్‌

ప్రజా సమస్యలపై మహోద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 25: రాష్ట్రంలో సిగ్గుమాలిన, హేయమైన పరిపాలన సాగుతోందని, కరవుబారిన పడి ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై మహోద్యమం నిర్వహిస్తామన్నారు. పిసిసి ఆధ్వర్యంలో శనివారం అనంతపురం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన ‘కరవుపై సామూహిక సత్యాగ్రహం’ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీనియర్ నాయకులు కెవిపి, కోట్ల సూర్యప్రకారెడ్డి, తులసిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే ముఖ్యమంత్రి పదవుల కోసం అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపా ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో కరవు నివారణ కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేక పోతున్నారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో రైతుల రుణాలు మాఫీ చేసిన ప్రధాని మోదీకి, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరవు కనిపించలేదా అని నిలదీశారు. కరవు నేపధ్యంలో వలసలు నివారించేందుకు 2005లో అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఈ పథకాన్ని సిఎం చంద్రబాబు రాష్ట్రంలో నిర్వీర్యం చేశారని నేతలు ఆరోపించారు. అనంతపురం మొదలు రాష్ట్రంలోని అన్ని కరవు జిల్లాలో మహోద్యమంలా పోరాటం కొనసాగిస్తామన్నారు. రాష్ట్భ్రావృద్ధి, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరవు నివారణ కింద చేపట్టాల్సిన 68 పనుల్లో ఇంకుడు గుంతలు మాత్రమే తవ్వుతున్నారని విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణాలు బేషరతుగా మాఫీ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు. పోలవరంతో సహా రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలన్నారు. డిసిసి అధ్యక్షుడు కోటా సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, పిసిపి అధికార ప్రతినిధి గౌతం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్, మాజీ మంత్రి కొండ్రు మురళి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిచంద్రారెడ్డి, ద్రోణంరాజు శ్రీనివాసరాజు, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్‌అలీ, మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేత వరప్రసాద్, అనంతపురం నగర అధ్యక్షుడు దాదాగాంధీ, రాష్ట్ర కమిటీ స్పోక్సెమన్ కెవి రమణ తదితరులు పాల్గొన్నారు.
కరవుకాలంలో గంజే దిక్కు!
కరవు కాలంలో ప్రజలను అదుకునేది గంజి మాత్రమేనని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అనంతపురం నగరంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘కరవుపై సామూహిక సత్యాగ్రహం’ కార్యక్రమంలో పార్టీ నేతలకురాగి గంజి పంపిణీ చేశారు. ఎన్.రఘువీరారెడ్డి గ్లాసుల్లో నింపిన రాగి గంజిని నేతలు నాదెండ్ల మనోహర్, కెవిపి రామచంద్రరావు, కొండ్రు మురళి, ద్రోణంరాజు శ్రీనివాసరాజు, కమలమ్మ, తులసిరెడ్డి, మల్లాది విష్ణు తదితరులందరికీ అందజేశారు. ‘దాహం దాహం.. నీరు కావాలి’ అన్న నినాదాలు రాసిన ఖాళీ బిందెల్ని ప్రదర్శించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు.

చిత్రం.. అనంతపురంలో శనివారం కరవుపై సామూహిక సత్యాగ్రహం సభలో ప్రసంగిస్తున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడి డ* నాయకులకు గంజి పంపిణీ చేస్తున్న పిసిసి అధ్యక్షుడు