రాష్ట్రీయం

నేడు బ్రాహ్మణ జాబ్ మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: హైదరాబాద్ మహా నగర మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలోని బ్రాహ్మణ నిరుద్యోగ యువతీయువకుల కోసం ‘జాబ్‌మేళా- 2017’ ను ఆదివారం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నేతృత్వంలో మొట్టమొదటి కార్యక్రమంగా నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళా ‘పైలట్‌ప్రాజెక్టు’గా చేపడుతున్నామని పరిషత్ చైర్మన్ కెవి రమణాచారి తెలిపారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జాబ్‌మేళాలో దాదాపు 40 ప్రైవేట్ కంపెనీలో పాల్గొంటున్నాయని, ఆయా కంపెనీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నియామకాలు చేస్తారని తెలిపారు. హైదరాబాద్ (యూసుఫ్‌గూడా) లోని నిమ్స్‌మే (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) ఆవరణలో నిర్వహించే కార్యక్రమాన్ని హోం మంత్రి నాయిని ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే అంశంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని రమణాచారి వివరించారు.