మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం
వల్లభాయ్ పటేల్ తొలి ప్రధానిగా ఉన్నట్లయతే ఈ దేశ చరిత్ర మరొక విధంగా ఉండేదని ఎక్కువమంది అభిప్రాయం. మీ అభిప్రాయం ఏమిటి?
స్వతంత్రం వచ్చాక పటేల్ జీవించింది కొద్దికాలమే. చరిత్ర గతిని మార్చగలిగినంత వ్యవధి ప్రధాని అయనా ఆయనకు ఉండేది కాదు. పటేలే దేశాధినేత అయతే కాశ్మీర్ సమస్య తలెత్తేదీ కాదు. అయతే... ఆక్రమిత కాశ్మీర్ మనది కాకుండా పోయేదీ కాదు. పాకిస్తాన్, చైనాల పన్నాగాలు సాగేవీ కావు.

ఈషికా అమ్మాళ్, సికిందరాబాద్
జంటనగరాలలో రెండు సంఘటనలు- ఒకటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్‌టికెట్లు అందక; మరొకటి ఇంజనీరింగ్ విద్యాసంస్థలో విద్యార్థినులకు కాబోలు, అశ్లీల మెసేజ్‌లు పెట్టిన టీచింగ్ సిబ్బంది. విద్యారంగం నిర్లక్ష్యం చేయబడితే ఎవరు దిక్కు? ఏది అభివృద్ధి?
ఆ రెండు ఘటనలకూ విద్యారంగ అభివృద్ధికీ సంబంధమేమిటి? తప్పుచేసిన వారిని శిక్షించవలసిందే.

జి. హేమంతకుమార్, ఎమ్మిగనూరు
కాంగ్రెస్ పార్టీ మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఊరేగింపు జరిపారు. ఏ మొహం పెట్టుకుని ఇతరులని అడుగుతున్నారు? తమ హయాంలో ఎంతమాత్రం మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు?
అది మాత్రం అడగొద్దు. సిగ్గులేని తెంపరితనానికి కాంగ్రెసువారు పెట్టింది పేరు.

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
‘సంపాదకుడు’, ‘ఎడిటర్’ - ఈ పదాలకు ఏదైనా తారతమ్యత ఉన్నదా?
వాడే వీడు.

ఎల్. ప్రపుల్లచంద్ర, ధర్మవరం
అమెరికా ట్రంప్‌కు ఇప్పట్లో బుద్ధి వస్తుందా? రాదా? ఐక్యరాజ్య సమితి ఆశయాలు మంటగలుపుతున్నారు కదండీ!
మంటగలుపుతుంటే మరి ఐరాస ఏమి చేస్తున్నది? దానికి లేని దుగ్ధ మనకేల? ఎంతైనా ట్రంప్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు. ఎన్నికల్లో చెప్పిందే ఆయన చేస్తున్నాడు. మనకు కష్టమో, నష్టమో కలుగుతాయని అతడినెందుకు తిట్టిపోయడం? వారి దేశం వారి ఇష్టం.

పి.వి. శివప్రసాదరావు, అద్దంకి
ప్రమాదాల పరామర్శలో జగన్ ఐపిఎస్, ఐఏఎస్ హోదా అధికారులపై అసహనంతో దురుసు ఆగ్రహాలతో మాట్లాడటంలో ఉద్దేశ్యమేమిటండి?
కుసంస్కారం, దురహంకారం.

తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు పాతనోట్లతో మొక్కు తీర్చుకుంటే 8 కోట్లకు పైగా, ఇంకా వచ్చే రద్దయన నోట్లను ఆర్‌బిఐ ఎందుకు మార్చాలి? ఉన్నవాళ్లు ఎలానో తిప్పలు పడి స్వామివారికి సమర్పించి విముక్తులవుతుంటే భక్తుల కోసం ఆ మాత్రం నష్టపడలేదా?
ఎందుకు పడాలి? అవేమీ దొంగనోట్లు కావు.

సి. ప్రతాప్, శ్రీకాకుళం
చట్టానికి దొరకక కొందరు, దొరికినా విచారణలో దశాబ్దాలు గడిచిపోతున్నందున కొందరు తప్పించుకుంటున్నారన్నది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో అక్రమార్కుల కేసులో దివంగత అమ్మ, ఆమె నెచ్చెలి శశికళకు శిక్షపడటం, అందుకు యావత్ దేశం సంతోషించడం దేశ రాజకీయాలలో ఒక ముఖ్యమైన మలుపుగా భావిస్తున్నారా?
ఎప్పుడు జరిగిన నేరం? ఎప్పుడు పండింది శిక్ష? మన దేశంలో న్యాయం ఇంత ఆలస్యమా అని సిగ్గుపడాలి.

ఎన్.జయకర్, హైదరాబాద్
పెద్దపెద్ద పదవులలో ఉన్న కొంతమంది తాము ఏ మతంవారు, ఏ ప్రాంతంవారు, ఏ కులం వారు అనుకుంటూ తమ విధులు నిర్వర్తిస్తున్నట్లు కనపడుతున్నది. న్యాయ వ్యవస్థలో క్లాస్-1 ఆఫీసర్లలో ఈ జాడ్యం ఈమధ్య ఎక్కువగా కనపడుతోంది. ఒక జడ్జి తను ఎస్‌టి కనుక చిన్నచూపు చూస్తున్నారని, ఇంకో జడ్జి ఈస్టర్ నాడు ప్రధానమంత్రి సమావేశం పెట్టారని, ఇంకో చీఫ్ సెక్రటరీ తనకి పదవీకాలం పెంచలేదని గగ్గోలు పెడుతున్నారు. ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయం కాదా? ఇలాంటి వారి చేతిలో ఏమి న్యాయం జరుగుతుంది?
నేరం వారిది కాదు. అలాంటి వారిని పెద్ద కుర్చీల్లో కూర్చోనిచ్చిన వ్యవస్థది.

పి. రామకృష్ణ, ఆదోని
రాహుల్‌గాంధీ తన ప్రసంగాలలో మోదీగారు 15 లక్షల విలువ చేసే సూట్ వేస్తారు. తానైతే ఖాదీ కుర్తా, పైజామా అవీ చినిగిపోయనవి వేస్తానన్నారు. ఆలోచించదగ్గ విషయమే. అయతే తన తండ్రి రాజీవ్‌గాంధీ తన హయాంలో రోజుకు ఎన్ని డ్రస్సులు మార్చాడో, ఎన్ని విహార యాత్రలకు వెళ్లారో అప్పటి దూరదర్శన్ నిండా ప్రతిరోజూ ఎలా కన్పించారో అతడికి తెలియదా?
తెలుసుకునేంత బుద్ధిని భగవంతుడు అతనికి ఇవ్వలేదు. పాపం, పసివాడు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్ - 500003.

: email :
sundaymag@andhrabhoomi.net