ఆంధ్రప్రదేశ్‌

నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మార్చి 26: రవాణా శాఖ కమిషనర్, ఐపిఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై టిడిపి నేతల దాడి చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరులో ఆదివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ టిడిపి నేతలు ఐపిఎస్ అధికారిపై దౌర్జన్యం చేయడమే కాకుండా నానారకాలుగా దుర్భాషలాడిన ఘటన బాధాకరమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, లేక రాక్షస పాలన సాగుతుందా? అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాతీపరుడు, సమర్థుడిగా పేరున్న బాలసుబ్రహ్మణ్యంపై దాడి ఖండనార్హమన్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నారు. నందిగామ బస్సు ప్రమాద ఘటనపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై కేసు పెట్టారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదని, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఈ సత్యాన్ని గ్రహించాలన్నారు. అధికారులను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలన్న దురాలోచనతో టిడిపి నేతలు దాడులకు తెగబడుతున్నారన్నారు. గతంలో తహశీల్దార్ వనజాక్షిపై దాడి కేసులో ఇరువర్గాలను పిలిపించి చంద్రబాబు రాజీ చేశారని, ఇప్పుడు కూడా అలాగే చేస్తారేమోనన్న అనుమానాన్ని అంబటి రాంబాబు వ్యక్తం చేశారు.