ఆంధ్రప్రదేశ్‌

రద్దయిన నోట్ల మార్పిడికి ముంచుకొస్తున్న గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: ఇటీవల కాలంలో రద్దయిన రూ.1000, రూ.500ల నోట్లను రిజర్వ్‌బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రం మార్చుకోటానికి కౌంట్‌డౌన్ ఆరంభమైంది. దీంతో సమీప చెన్నైలోని ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం వద్ద బారులుదీరుతున్నారు. అయితే నోట్ల రద్దుకు ముందు విదేశాలకు వెళ్లినవారికి మాత్రం కేంద్ర ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. తమవద్ద ఉన్న నోట్లను పాస్‌పోర్టు, పాన్‌కార్డు, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఇతరత్రా ఆధారాలతో ఆర్‌బిఐ కేంద్రాల్లో మార్చుకునే వెసలుబాటు ఉంది. దీంతో ఇటీవల స్వస్థలాలకు తిరిగి వచ్చిన ప్రవాసాంధ్రుల ఇళ్ల చుట్టూ దళారులు తిరుగుతున్నారు. తమవద్దనున్న నోట్లను వారి వారి పేర్లతో మార్పిడి చేయిస్తే 20 నుంచి 40 శాతం వరకు కమిషన్ ముట్టచెబుతామంటున్నారు. ఇక కొందరు దళారులు విమానాశ్రయాల్లోనే మకాం వేసి తమవద్దనున్న పాత నోట్లను కమిషన్ ప్రాతిపదికన అక్కడి సెక్యూర్టీ వద్ద రికార్డు చేయించే పనిలో నిమగ్నమై ఉన్నారు.