ఆంధ్రప్రదేశ్‌

యువతలో జాగృతికి ‘స్ఫూర్తి’ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), మార్చి 26: కృషి, పట్టుదల, అచెంచలమైన ఆత్మవిశ్వాసంతో అభ్యుదయ పధాన పురోగమించాలనుకునే యువతలో జాగృతిని, చైతన్యాన్ని నింపడానికి స్ఫూర్తి అవార్డులు ఎంతగానో దోహదం చేస్తాయని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర వేదికపై బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యాన ఐదుగురు విశిష్ఠ వ్యక్తులకు స్ఫూర్తి అవార్డులను అందజేశారు. కనుల పండువగా జరిగిన ఈ ప్రదానోత్సవ సభకు అలహాబాద్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, అవార్డుల జ్యూరీ చైర్మన్ జస్టిస్ అంబటి లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. దాతృత్వ గుణం ఉండటం ఒక ప్రత్యేకత అయితే, మంచి మనసుతో సమాజానికి నిస్వార్ధమైన రీతిలో తమ తమ పరిధిలో ఆయా రంగాలకు సేవలందిస్తున్న వ్యక్తులకు ఎంచుకుని కృష్ణమూర్తి ఫౌండేషన్ ప్రతియేటా అవార్డులను అందజేయడం ఎంతో ప్రశంసనీయమన్నారు. గౌరవ అతిథి ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్యశాల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యారంగంతో పాటు వైద్యరంగంలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇప్పటికి కూడా మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సరైన ప్రాథమిక విద్య అలానే ప్రాథమిక వైద్య సౌకర్యాలు లేవన్నారు. విశిష్ఠ అతిథి, దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతిగా సేవలందించిన ప్రొఫెసర్ యడ్ల చినసింహాద్రి మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థిక వనరులు అంతగా లేని సమయంలో స్వచ్చంధంగా బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ముందుకు వచ్చి 25 లక్షల రూపాయలను విశ్వవిద్యాలయానికి తాను విసిగా ఉన్న కాలంలో అందజేశారని సభాముఖంగా తెలిపారన్నారు.
ఆ స్ఫూర్తితోనే దేశంలో విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా స్వయం సమృద్ధికి చిందడానికి నిలదొక్కుకోవడానికి, దాతల సహకారం పొందడానికి అవకాశం లభించిందన్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎఎస్ కిరణ్‌కుమార్ పక్షాన అవార్డును స్వీకరించిన ఆయన ప్రతినిధి డాక్టర్ భానుమూర్తి మాట్లాడుతూ ఇస్రో ఘనవిజయాలు సాధించడానికి ఈ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సమష్ఠి కృషి కారణమన్నారు. రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం స్వామీజీ కపాలీశానంద, జాతీయ కవి డాక్టర్ ఎన్ గోపి, డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ పాఠశాల వ్యవస్థాపకురాలు వై నౌకోసింహాద్రి, ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత డాక్టర్ మోదడుగు విజయగుప్తలకు కృష్ణమూర్తి ఫౌండేషన్ పక్షాన అతిథులు అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతల్లో ఒకరైన నౌకో సింహాద్రి తెలుగుభాష, తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాల పట్ల తనకున్న గౌరవ ప్రపత్తులను చాటుకుంటూ తీయనైన తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడి అందరినీ ఆహ్లాదపర్చారు. సభలో ఎఎన్‌యు మాజీ విసి ఆచార్య వి బాలమోహన్‌దాస్, డాక్టర్ ఓలేటి పార్వతీశం, జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డి, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కె రామ్మోహనరాయ్ తదితరులు ప్రసంగించారు.

చిత్రం.. ఇస్రో చైర్మన్ తరఫున స్ఫూర్తి అవార్డునందుకుంటున్న ప్రతినిధి డాక్టర్ భానుమూర్తి