ఆంధ్రప్రదేశ్‌

పోలవరం భూసేకరణలో ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 26: పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు మండలాల్లో భూములను సేకరించే విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ మండలాల్లో 35 వేల ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు భూసేకరణ ఒకెత్తయితే.. ఇపుడు ముంపు మండలాల్లో భూసేకరణ మరో ఎత్తుగా పరిణమించింది. కొత్త భూసేకరణ చట్టం రాక ముందు, అప్పటి చట్టాలపై అంతగా అవగాహన లేనపుడు జరిగిపోయిన భూసేకరణ ప్రక్రియ నుంచి అధికారులు చేతులు దులిపేసుకున్నప్పటికీ ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి విలీనమైన ముంపు మండలాల్లో చేపట్టిన భూసేకరణ అధికార యంత్రాంగానికి గుదిబండగా మారిందని తెలుస్తోంది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని నష్టపరిహారం నిర్ణయించిన తర్వాత భూముల్లోకి రావాలని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తూ భూసేకరణ అధికారులను అడ్డుకుంటున్నారు. గ్రామ సభల ద్వారా భూసేకరణ ప్రక్రియకు ఉపక్రమించిన యంత్రాంగానికి ఎదురీత తప్పడం లేదు. కొత్త చట్టం ప్రకారం నష్టపరిహారం పూర్తిగా చెల్లించి, పునరావాస ప్యాకేజీ అమలు చేసిన తర్వాతే భూములు ఇస్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో అధికారులు ముందుకెళ్లలేని స్థితి నెలకొంది. ఇప్పటి వరకు సేకరించిన వేలాది ఎకరాల తీరు ఒక విధంగా ఉంటే ఇపుడు ముంపు మండలాల్లో 35 వేల ఎకరాల భూసేకరణ తీరు మరో విధంగా అధికార యంత్రాంగానికి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.
ఈ నేపధ్యంలో పోలవరం ముంపు మండలాల్లో భూ సేకరణ గుదిబండగా మారింది..పోలవరం భూసేకరణ ఆరంభంలో ఎకరానికి రెండు నుంచి మూడు లక్షల రూపాయల పరిహారం ఇచ్చి సాధ్యమైనంత వరకు భూసేకరణ పూర్తి చేసిన అధికార యంత్రాంగానికి ఇపుడు కొత్త చట్టం ప్రకారం మన్యంలో భూమిని సేకరణపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో ఉండే ఏడు మండలాల్లో మొత్తం దాదాపు 70 వేల ఎకరాల వరకు సేకరించాల్సివచ్చింది. అయితే పోలవరం ముంపు భూభాగం ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే దాదాపు 35 వేల ఎకరాల వరకు సేకరించారు. ఇంకా మరో 35 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు నేపధ్యంలో ఎపిలో కలిసిన ఏడు మండలాల్లో ప్రస్తుతం గతంలో మిగిలిపోయిన 35వేల ఎకరాల భూసేకరణకు సంబంధించి అధికార యంత్రాంగం కసరత్తు చేపట్టింది. ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఐదు ముంపు మండలాల భూసేకరణ భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న రెండు ముంపు మండలాల భూసేకరణ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతోంది.
ప్రస్తుతం పోలవరం ముంపు జాబితాలోకి మరో 92 గ్రామాలు కలిసాయి. గతంలో విడుదలైన 111 జీవోలో ఈ గ్రామాలు లేవు. దీంతో 462 గ్రామాలు ముంపు జాబితాలో చేరాయి. మార్చి 24వ తేదీ వరకు భూసేకరణ పరిశీలిస్తే.. ఇప్పటి వరకు భూసేకరణకు రూ.2104.69 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.7946.13 కోట్లు భూమికి అవసరంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో హెడ్‌వర్క్సుకు సంబంధించి అవసరమైన 256 ఎకరాల సేకరణ పూర్తయింది. దీనికి కేవలం రూ.3.32 కోట్లే ఖర్చయింది. ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి అవసరమైన 6238 ఎకరాలు సేకరించగా అవసరమైన మొత్తం రూ.150.66 కోట్లను చెల్లించేశారు. ముంపునకు గురయ్యే దేవీపట్నం మండలంలో భూసేకరణకు సంబంధించి 9158 ఎకరాలకుగాను ఇప్పటి వరకు 7385 ఎకరాలు సేకరించారు. దీనికి రూ.162.76 కోట్లు ఇప్పటి వరకు చెల్లించారు. ఇంకా సేకరించాల్సిన భూమికి రూ.177.25 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉంది. భూమికి భూమి 18402 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 597 ఎకరాలే సేకరించారు. దీనికి రూ.2.54 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.1780 కోట్లు ఖర్చు చేయాల్సి వుంది. పునరావాస కాలనీలకు సంబంధించి అవసరమైన 4250 ఎకరాలు సేకరించాల్సి వుంది. ఖమ్మం జిల్లా నుంచి పోలవరం ప్రాజెక్టు నేపధ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన ముంపు మండలాల్లో మొత్తం 67032 ఎకరాలు సేకరించాల్సి వుండగా ఇంకా 34496 ఎకరాలు సేకరించాల్సి వుంది.
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో హెడ్ వర్క్సుకు, కుడి ప్రధాన కాలువ, ముంపు గ్రామాల్లో అవసరమైన మొత్తం 14828 ఎకరాల భూమి సేకరణ పూర్తయింది. అదే విధంగా భూమికి భూమి, పునరావాస కాలనీలకు అవసరమైన భూమి, ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన ముంపు మండలాలకు సంబంధించి ఇంకా 15895 ఎకరాలు సేకరించాల్సి ఉంది. విశాఖపట్నం జిల్లా పరిధిలో భూసేకరణ మొత్తం పూర్తయింది. కృష్ణా జిల్లా పరిధిలో కూడా భూసేకరణ పూర్తయింది. ఏదేమైనప్పటికీ పోలవరం భూసేకరణ ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో తలకు మించిన భారంగా మారిందని చెప్పొచ్చు.