ఆంధ్రప్రదేశ్‌

పేద బ్రాహ్మణుల అభివృద్ధే ధ్యేయం : ఐవైఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: నిరుపేద బ్రాహ్మణుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెడుతోందని, వాటిని సద్వినియోగపర్చుకుని ఆర్థికంగా ఎదగాలని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మనర్ ఐవిఆర్ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం విశాఖ మధురవాడలో కనె్వన్షన్ సెంటర్‌లో ఎలైట్ సంస్థ ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో ఉన్న ఎలైట్ పీపుల్‌తో మరింత కట్టుదిట్టంగా బ్రాహ్మణ కమ్యూనిటీని అభివృద్ధి చేసేందుకు అంతా కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా కశ్యప, ఆహార, ఆశ్రమ పథకం కింద అనాథ పిల్లలకు(14 ఏళ్ళలోపు) వికలాంగులకు, వితంతులకు, 60 ఏళ్ళపైబడిన వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయలు, వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులకు నెలకు మూడు వేల వంతున సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. భార్గవ భాగస్వామ్య పథకం శ్రీకృష్ణ సుధామ దాననిధి పథకం, అక్షయ బ్రాహ్మం నిధి పథకం, ప్రకాశం స్వచ్ఛంద సేవకుల పథకం, సింధుతాయి అనాథల విద్య సహాయ పథకం వంటి పథకాలు ఎన్నో ప్రవేశపెడుతున్నారన్నారు. భారతి, గాయత్రి పథకాలు విద్యాభివృద్ధికి సహాయం చేస్తున్నాయని, యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి పథకాలు సంక్షేమం, సాంఘిక భద్రత అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎంతోమంది విద్యార్థినీ, విద్యార్థులకు ఉన్నత విద్యకోసం స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామన్నారు. విశాఖపట్నంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా రూ.50 లక్షలు, మరో రూ.50 లక్షలు దాతల నుండి విరాళాలు సేకరించి కల్యాణమండపం, షాపింగ్ కాంప్లెక్స్‌లను ఒక ఏడాదిలోపు నిర్మించాలని దాతలకు సూచించారు. అనంతరం మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి పివిఆర్‌కె ప్రసాద్, కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, వీ సాఫ్ట్ చైర్మన్ లక్ష్మీ నరసింహమూర్తిలకు విశాఖ జిల్లా డైరెక్టర్ ఎంవిఆర్ కృష్ణప్రసాద్ చేతులమీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడబూసి శ్రీ్ధర్, స్టీల్‌ప్లాంట్ సిఎండి మధుసూదన్, ఏపీ బ్రాహ్మణ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ సిఇఓ అబ్జిత్ జయం రఘురాం తదితరులు పాల్గొన్నారు.