ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో ఘనంగా ఉగాది మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, మార్చి 26 : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో ఆదివారం యాగశాల ప్రవేశంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా కర్నాటక, తదితర ప్రాంతాల నుంచి భక్తజనం పెద్దఎత్తున తరలిరావడంతో శ్రీశైలం వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా కర్నాటక భక్తులు కాలినడకన అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీశైలం మల్లికార్జునస్వామి, శ్రీభ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకున్నారు. మహోత్సవాల్లో భాగంగా ఉదయం దేవస్థానం ఇఓ నారాయణ భరత్‌గుప్త ఆధ్వర్యంలో ఆలయ అర్చక వేద పండితులు, అధికారులు పూజాద్రవ్యాలతో యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ, లోకకల్యాణం కాంక్షిస్తూ అర్చక వేద పండితులు సంకల్పం పఠించారు. ఉగాది మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన ఆదివారం స్వామి అమ్మవార్లు భృంగివాహన సేవలో, శ్రీభ్రమరాంబికాదేవి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అక్కమహాదేవి అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు మేళతాళాల మధ్య శ్రీశైలం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఇక ఉగాది మహోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ, శ్రీభ్రమరాంబిక దేవి మహాదుర్గా అలంకారం దర్శనం ఇవ్వనున్నారు.

చిత్రాలు... ఉగాది ప్రారంభ పూజలు చేస్తున్న ఇఓ నారాయణ భరత్‌గుప్తా * ఉత్సవ మూర్తులకు పూజలు చేస్తున్న వేద పండితులు