ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 27: రాష్ట్రంలో కనీసం మైనార్టీ సంక్షేమ శాఖను నడపటానికి మంత్రివర్గంలో మైనార్టీ వర్గానికి చెందిన ఒక్క వ్యక్తి కూడా లేకపోవటం మైనార్టీలను అవమానపర్చడమేనంటూ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో వైకాపా సభ్యులు మొహ్మద్ ముస్త్ఫా షేక్, ఇతర సభ్యులు ధ్వజమెత్తారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడే సమయంలో ముస్త్ఫా ఇతర సభ్యులు అడుగడుగున అడ్డుతగులుతూ మైనార్టీ మంత్రి పోకపోవటం ఇదేమి దరిద్రమంటూ నినదించారు. ఏదిఏమైనా గత 11 రోజుల్లో తొలిసారిగా స్వల్ప వాగ్వివాదాలు మినహా వాయిదాలు, వాకౌట్లు, పోడియం వద్ద నిరసనలు, ప్లకార్డుల ప్రదర్శన లేకుండా సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ప్రశాంతంగా జరిగాయి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గైర్హాజరు వలన రెండు ప్రశ్నలు వాయిదా పడ్డాయి. మిగిలిన 8 ప్రశ్నలపై రసవత్తర చర్చ జరిగింది. ఓ దశలో అధికారులు ఉద్యోగులపై దాడులు చేస్తున్నారంటూ వైకాపా, టిడిపి సభ్యులు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. జీరో అవర్‌లో ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు.