ఆంధ్రప్రదేశ్‌

శాసనసభలోనే బాహుబలి-2 చూపిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 27: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లేకపోవటంతో ఈ రోజు సభ ప్రశాంతంగా జరిగిందని ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు అనటంతో.. మాకు మాట్లాడే అవకాశం ఇస్తే గొడవలెందుకు జరుగుతాయని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి తిప్పికొట్టారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఎదురుపడ్డ కాలువ, కోటంరెడ్డి సరదాగా మాట్లాడుకున్నారు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని కోటంరెడ్డి అనగా.. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు, సద్విమర్శలు చేస్తే మాకెలాంటి అభ్యంతం లేదన్న కాల్వ, అలాకాకుండా సభను జరగనివ్వకుండా అడ్డుకోవడం తగదన్నారు. పోలవరం ప్రాజెక్టు పవర్‌పాయింట్ ప్రజెంటేష్‌న్‌కు రావాలని కాలువ పిలవగా మాకు బాహుబలి -2 సినిమాను సభలోనే మీరు చూపిస్తున్నారు కదా.. అని కోటంరెడ్డి చమత్కరించారు. సినిమానే కాదు పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి చూపిస్తాం తొందర పడవద్దని కాలువ బదులిచ్చారు. తెదేపా ఎమ్మెల్యేలు చింతమనేని, బొండా ఉమా, ఎమ్మెల్సీలు గాలి, బుద్ధా మధ్య కమిషనర్ సంఘటనపై చిట్‌చాట్ జరిగింది. బాబు అదేశాల మేరకు ట్రాన్సుపోర్టు కమిషనరుకు క్షమాపణ చెప్పానని బుద్దా వెంకన్న అంటే, ఒక ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పడమంటే చిన్న విషయం కాదన్న విప్ చింతమనేని. క్రమశిక్షణకు మారుపేరున్న తెదేపాలోనే ఇటువంటివి సాధ్యం అని మిగిలిన ఎమ్మెల్యేలు తెలిపారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా అని మీరు ఎదైనా చేస్తారు.. అదే ప్రతిపక్ష నేతలు విషయంలో వెంటనే కేసులు పెడతారని వైకాపా ఎమ్మెల్యేలు వాఖ్యానించగా, తప్ప చేసినప్పుడు క్షమాపణ చెప్పడం సంస్కారం అని అది తెదేపా నేతలు తిప్పికొట్టారు. ఇదే సమయంలో వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నిరసనపై కొందరు టిడిపి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ క్షమాపణ చేప్పినప్పటికీ ఇంత రాద్ధాంతం చేయడం తగదన్నారు.