ఆంధ్రప్రదేశ్‌

డిసెంబర్ నాటికి గాలేరు-నగరి నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 20: గాలేరు-నగరి మొదటి దశ కింద ఈ ఏడాది డిసెంబర్ లోపు రైతులకు సాగు, తాగునీరు అందించి సీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బుధవారం కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చిన ఆయన సమీపంలోని శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ దశాబ్దాలకాలంగా సోమశిల బ్యాక్‌వాటర్‌ను ఒంటిమిట్ట శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు తీసుకురాలేకపోయారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గత ఏడాది శ్రీరామనవమికి శంకుస్థాపనచేసి ఈ శ్రీరామనవమికి నీరు తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. సోమశిల బ్యాక్‌వాటర్ ఈప్రాంతానికి రావడం వల్ల రాజంపేట నియోజకవర్గ రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఒంటిమిట్ట చెరువుకింద 1100 ఎకరాలు సాగుచేయాల్సివుండగా 2వేల ఎకరాలు సాగుకు నోచుకుందని , వచ్చే ఏడాదికి 3వేల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. గాలేరు-నగరి మొదటి దశ కింద నీరు విడుదలైతే రాజంపేటతోపాటు సీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. రానున్న రోజుల్లో సాగు, తాగునీటి కష్టాలు తీరతాయని ఆయన పేర్కొన్నారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉందని, రాముడి దయతో ఒంటిమిట్టకు దేశంలోనే ఒక గొప్ప దేవాలయంగా ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు తీసుకువస్తామన్నారు. ఒంటిమిట్ట అభివృద్ధికి టిటిడి అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. ఒంటిమిట్టను సుందర నందనవనంలా తయారుచేసి, గార్డెన్ దీవిగా మార్చి పర్యాటకులతోపాటు రామభక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆధ్యాత్మికత, భక్తి విశ్వాసాలు ప్రతి ఒక్కరిలో పెంపొందించే విధంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానాన్ని తీర్చిదిద్దుతామని సిఎం పేర్కొన్నారు. సోమశిల బ్యాక్‌వాటర్ ద్వారా జిల్లాలో నీటి కరవు తీరుతుందన్నారు. బ్రహ్మంసాగర్ లో నీరు ఉండటం, ఈ ఏడాది వేలాది బోర్లలో నీరు చేరడం, ప్రస్తుతం శ్రీరామపథకం నీటి ద్వారా రైతులకు మేలు చేకూరుతుందని స్పష్టం చేశారు. అంతకుమునుపు జలవనరుల అభివృద్ధిశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీరు ఇచ్చిన కారణంగా చీనీ రైతులు వివిధ రకాల పంటలు సాగుచేసుకున్న రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు.
కలెక్టరేట్ భవనాలు ప్రారంభం
కడపలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఆ సందర్భంగా సిఎం కలెక్టరేట్ ప్రాంగణాన్ని, నూతనంగా నిర్మించిన భవనాలను, వివిధ గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధులను కేటాయించి పనులను వేగవంతంగా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేని పరిస్థితుల్లో నూతన కలెక్టరేట్ భవనాల నిర్మాణం ఆలస్యం కావడం వల్ల ప్రభుత్వంపై మరింత భారం పడిందని సిఎం స్పష్టం చేశారు. 2008 మే 20న అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.43.50కోట్లు మంజూరు చేసి 13.78 ఎకరాలలో కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

chitram శ్రీరామ ఎత్తిపోతల వద్ద మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు