ఆంధ్రప్రదేశ్‌

రూ. 2 వేల కోట్ల భూకుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 27: రాష్ట్రంలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో విశాఖపట్టణం పరిసరాల్లో రెండువేల కోట్ల రూపాయలు పైగా విలువైన భూకుంభకోణం జరిగిందని దీనిపై తక్షణం శాసనసభా సంఘం లేదా సిఐడిచే విచారణ జరిపించాలంటూ బిజెపి పక్షనేత పెనె్మత్స విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం వెనుక వివిధ స్థాయిల్లోని ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, రాజకీయ నేతలు, మాజీ ప్రతినిధులు, ముఖ్యంగా పాలకుల్లో కొందరు చివరకు న్యాయవ్యవస్థలో కొందరి అండదండలు ఉండటం వలనే గడచిన రెండేళ్లుగా తాము నెత్తీనోరు కొట్టుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందంటూ నిప్పులు చెరిగారు. ఈ విషయంలో తనకు సైతం బెదిరింపులు వస్తున్నాయంటూ దీనికి తాను ఏ మాత్రం బెదరనన్నారు. శాసనసభ సమావేశాల్లో 11వ రోజైన సోమవారం ప్రశ్నోత్తరాల అనంతరం పెనె్మత్స తాను అడిగిన స్వల్ప వ్యవధి ప్రశ్నకు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ భారీ కుంభకోణానికి పార్టీ ఏదైనా ప్రభుత్వంలో ఎంతో పలుకుబడి కల్గిన హైదరాబాద్ జలవిహార్‌కు చెందిన నడింపల్లి వెంకట రామరాజు కారకుడంటూ అసైన్డ్ భూముల రైతులకు ఆయన పేర జారీ అయిన చెక్‌లు, అగ్రిమెంట్ల కాపీలను సభలో ప్రదర్శించారు. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ భూసమీకరణ చేపట్టేలా కొందరు పెద్దలు ప్రభుత్వంలో తమ పలుకుబడి వినియోగించి తొలుత 2016 నవంబర్ 14 తేదీన జీవో 290ను జారీ చేయించారన్నారు. పైగా అసైన్డ్ భూములను విక్రయించుకునే వీలు కల్పించారన్నారు. దీంతో ఆ ఘరానా పెద్దలు పెందుర్తి, ఆనందపురం మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల విలువైన భూములను చేజిక్కించుకున్నారంటూ నాడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను సభలో ప్రదర్శించారు. అయితే దీనికి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అడ్డుతగులుతూ వార్తా కథనాలు ఆధారంగా సభలో ప్రస్తావించవద్దన్నారు. దీనికి ఆయన బదులిస్తూ జాతీయ ప్రధాన రహదారుల వెంబడి గల ఈ భూముల్లో గజం ధర రూ.20వేలు పైగా ఎకరం విలువ రెండు కోట్ల రూపాయలు పైగా ఉందన్నారు. ఈ భూములపై కనే్నసిన కొందరు పెద్దలు వక్రమార్గాల్లో వాటిని రైతుల దగ్గర నుంచి కాజేసేందుకు రంగంలోకి దిగారన్నారు. ముందుగా గ్రామ సర్పంచ్‌లకు రెండు లక్షలు చొప్పున ముట్టచెప్పారన్నారు. వారి ద్వారా ఎకరాకు 10 లక్షలు మేర బేరం కుదుర్చుకుని తొలుత లక్ష రూపాయల చొప్పున నడింపల్లి పేరిట ఎస్‌బిఐ చెక్‌లు ఇచ్చారన్నారు. మిగిలిన 9 లక్షలకు అగ్రిమెంట్లు కుదుర్చుకోటంతోపాటు ఆ అమాయక రైతులచే ఖాళీ ప్రాంసరీ నోట్లు రాయించుకున్నారన్నారు. చట్ట ప్రకారం అసైన్డ్ భూములు విక్రయించినా, కొనుగోలు చేసినా నేరం కావటంతో పాపం ఆ రైతులు తలొగ్గారని అన్నారు. ఇక ఈ కుట్రలో భాగంగా ఉడా 2016 నవంబర్ 25 తేదీన 304 నెంబర్‌తో జీవో జారీ చేసిందన్నారు. ఇందులో తొలుత వేర్వేరు సర్వే నెంబర్ల కింద మొత్తం 542 ఎకరాల భూమిని సమీకరిస్తున్నామని ప్రకటించడమే గాక ఎకరాకు 1200 గజాల అభివృద్ధిపరచిన స్థలాన్ని అందచేస్తామని ప్రకటించారని అన్నారు. ఇదే సమయంలో ఆ పెద్దలు పరిసరాల్లో మరో 500 ఎకరాల అసైన్డ్ భూములపై కనే్నసారని దీనికి సంబంధిత రైతులు అంగీకరించకపోవటంతో వారిని బెదిరించి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఆ భూముల్లో చెరువులు, కొండలు తొలగించి రహదారులను నిర్మించి, బలహీన వర్గాలపై ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ కేసులు పెట్టించారన్నారు. ఈ నేపధ్యంలో 2016 డిసెంబర్ 13న ఎమ్మెల్యే వెలగపూడి ఆందోళనకు ఉపక్రమించడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ వెంటనే స్పందించి ఉడా నుంచి అభివృద్ధిపరచిన స్థలాలను భూ యజమానులకే అందించేలా 332 జీవో జారీ చేయించారన్నారు. మొత్తంపై దొంగలను గదిలో ఉంచి తాను తాళం వేయించినప్పటికీ నేటివరకు ఎలాంటి విచారణ లేదన్నారు. దీనిపై పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ బదులిస్తూ ముడపాక గ్రామంలో రాము అనే వ్యక్తి అసైన్డ్ భూ యజమానుల నుంచి బలవంతంగా ఒరిజినల్ పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, హక్కు దస్తావేజులు, అసలు దస్తావేజులను తన దగ్గరే ఉంచుకున్నారంటూ 2017 ఫిబ్రవరిలో ఫిర్యాదులు రాగా అతనిపై పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారన్నారు. జిరాయితీ భూముల పట్టాదారు భూ ధ్రువపత్రాలు కల్గినవారికి స్థలాల కేటాయింపు జరిగినప్పుడు అసైన్డ్ భూములకు సంబంధించి అసలైన అసైనీలకే అందచేస్తామంటూ హామీనిచ్చారు.