ఆంధ్రప్రదేశ్‌

మొత్తం దేవాలయాలన్నింటిలోనూ నూతన వేతన స్కేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 27: రాష్ట్రంలోని అత్యధిక దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల నిర్వహణే కష్టతరంగా మారుతున్న పరిస్థితుల్లో అన్ని దేవాలయాల్లో పిఆర్‌సి సిఫార్స్‌ల ప్రకారం నూతన వేతన పే స్కేళ్లను అమలుపర్చటం సాధ్యపడదంటూ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్పష్టం చేశారు. పరిపాలన నిర్వహణ వ్యయంలో 30 శాతానికి మించి జీతాల చెల్లింపు సాధ్యపడదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆదాయం కల్గిన 11 దేవాలయాల్లోనే సిబ్బందికి కొత్త వేతనం అమలు జరుగుతున్నదన్నారు. శాసనసభలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో టిడిపి సభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు. ధూళిపాళ్ల మాట్లాడుతూ రాష్ట్రంలో 25వేల దేవాలయాలు ఉండగా కేవలం 11 దేవాలయాలకే కొత్త వేతనాలు పరిమితం చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమిషనర్, ఇతర ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. ఉద్యోగులకు జీతాలు ట్రెజరీల ద్వారా చెల్లించాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ అనేక ఆలయాల్లో కీలకమైన పూజారులకే నామమాత్రపు వేతనాలు లభిస్తున్నాయన్నారు.కోర్టు కేసుల వలన పదోన్నతులకు అవరోధం కల్గుతున్నదన్నారు.