ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వానిదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 27: గోదావరి పుష్కరాల్లో తొలిరోజు 2015 జూలై 14తేదీ జరిగిన తొక్కిసలాట, 28 మంది పుష్కర యాత్రికుల మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటు చర్యలు, ప్రధానంగా మీడియా పిచ్చి కారణమైనందున దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైకాపా సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో జగ్గిరెడ్డి మాట్లాడుతూ అసలు ఈ దుర్ఘటనకు కారకులైన వారెవరిపై కూడా నేటి వరకు చర్య తీసుకోలేదని, కలెక్టర్ కూడా విచారణ కమిషన్‌కు తప్పడు నివేదికలు అందజేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ అంశంపై జరిగిన చర్చలో వైకాపా, టిడిపి సభ్యుల మధ్య స్వల్ప వివాదం చెలరేగింది.
టిడిపి సీనియర్ సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, యరపతినేని శ్రీనివాసరావు, తదితరులు కల్పించుకుంటూ మీడియా పిచ్చి ఉంటే జగన్‌వలే టివి, పత్రికలు పెట్టుకోలేదు కదా అంటూ ఎదురు దాడికి దిగారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా విఐపిలకు ఘాట్ ఏర్పాటు చేసినప్పుడు పుష్కర ఘాట్‌లో ఎందుకు స్నానం చేయాల్సి వచ్చిందన్నారు. బాబు పుష్కర స్నానంపై కూడా మైలేజి కోసం అవసరమైన డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం బోయపాటి శ్రీను చేసిన హంగామా కూడా ఈ దుర్ఘటనకు కొంత కారణమన్నారు. 51 మంది గాయపడితే కేవలం 31 మందికే నష్టపరిహారం లభించిందన్నారు. అసలు వాహనాల రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ సిఎం వెంట 80 పైగా వాహనాలు వచ్చాయంటూ వాటి ఫొటోలను సభలో ప్రదర్శించారు.
మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సాంప్రదాయం ప్రకారం పుష్కర ఘాట్‌లోనే స్నానం చేయాలనేది అత్యధిక మంది భావన.. గతంలో కాంగ్రెస్ సిఎంలు కూడా అక్కడే చేసారు. పైగా కంచి కామకోటి పీఠాధిపతి అక్కడే స్నానం చేస్తున్నారు.. అనంతరం సిఎంచే వస్త్రాలు ఇప్పించాలని దేవాదాయవాఖ కమిషనర్ అనూరాధ చెప్పి ఆ ఘాట్ వైపుకు తీసుకెళ్లారని అన్నారు. కమిషన్ నివేదిక వెలువడిన అనంతరం బాధ్యులపై చర్య తీసుకోటంతో పాటు క్షతగాత్రులందరికీ సహాయం అందచేస్తామన్నారు. బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ పుష్కరాలు సందర్భంగా రూ.1500 కోట్లు వెచ్చించి గ్రామాల్లో కూడా వౌలిక సదుపాయాలను సమకూర్చామన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే హైకోర్టు రిటైర్డ్ జడ్జి సివై సోమయాజులతో విచారణ కమిషన్‌ను నియమించిందన్నారు.
ఎన్‌హెచ్ 216 అభివృద్ధికి 137 కోట్లు
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో 16వ జాతీయ రహదారిని, అమలాపురంలో 216వ జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ రూ.137 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని దానికి సంబంధించిన ప్రతిపాదనలు సాంకేతిక కమిటీ పరిశీలనలో ఉన్నాయని ఆర్ అండ్ బి మంత్రి శిద్దా రాఘవరావు సభ్యుడు అయితాబత్తుల ఆనందరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
దుల్హన్ పథకం నిరంతర ప్రక్రియ
ముస్లిం మైనార్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన దుల్హన్ కింద దరఖాస్తుల స్వీకరణ, క్లయిమ్‌ల మంజూరు ఒక నిరంతర ప్రక్రియగా వైకాపా సభ్యులు మహ్మద్ ముస్త్ఫా షేక్, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అమీజాద్ బాషా షేక్ బేపరి, వై.సాయి ప్రసాద్‌రెడ్డి, డాక్టర్ దేవాయి తిప్పారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మైనార్టీ సంక్షేమ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. 2015 ఏప్రిల్ 2తేదీ నుంచి 2016 డిసెంబర్ 21 తేదీ వరకు 20వేల 027 దరఖాస్తులు అందగా వాటిల్లో 12వేల 406 దరఖాస్తులకు నిధులు మంజూరు చేశామన్నారు. ఇందుకోసం రూ.62 కోట్లు చెల్లించామన్నారు.